Breaking News

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి దాన్యం కొనుగోలు కేంద్రాల ‌ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల‌ని సంబంధిత అధికారుల‌ను జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత అధికారుల‌తో వరి ధాన్యం కొనుగోళ్ల ఏర్పాటుపై మాట్లాడారు. వారం రోజుల్లో ఆయా కేంద్రాల‌కు వచ్చే ధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని సమయానుకూలంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని పేర్కొన్నారు. అందుకు అవసరమైన అన్ని సదుపాయాలు సిద్ధం చేసుకోవాల‌ని ఆదేశించారు. అవసరమైన ఏర్పాట్లను అధికారులు త్వరగా పూర్తి చేయాల‌న్నారు.

సుమారు 7 ల‌క్షల‌ మెట్రిక్‌ టన్నుల‌ ధాన్యం ల‌క్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మిల్లులు ట్యాగింగ్‌, రవాణా తదితర ఏర్పాట్లు చేసుకోవాల‌న్నారు. ధాన్యం 17 శాతం లోపు ఉండేవిధంగా ఆరబెట్టాల‌ని, ఎక్కడ కూడా కడ్త తీయకుండా ప్రాపర్‌ గా హార్వెస్ట్‌ చేస్తే సమస్య రాదని, సరైన సమయంలో హర్వేస్టింగ్‌ చేయించే బాధ్యత ఏఈఓల‌దేనని, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని సర్టిఫై చేయాల‌ని ఆదేశించారు. ప్రతి సెంటర్‌లో కోవిడ్‌ నిబంధనలు పాటించాల‌ని, మాస్కులు అందరూ ధరించాల‌ని శానిటైజర్‌ ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాల‌ని పేర్కొన్నారు. డివిజన్‌ స్థాయిలో, జిల్లా స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

వచ్చిన ధాన్యం వచ్చినట్టు మిల్‌కు పంపించాల‌ని వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాల‌ని తద్వారా రైతుల‌కు వీలైనంత త్వరగా దాన్యం డబ్బు చెల్లించడానికి వీల‌వుతుందన్నారు. రైస్ మిల్లులు కడ్త పేరట వేధిస్తే చర్యలు వుంటాయని, అవసరమైతే మిల్‌ సీజ్‌ కూడా చేస్తామన్నారు. మొత్తం వరి దాన్యం కొనుగోలు కొరకు గతంలో ఏర్పాటు చేసిన సెంటర్లు ఏర్పాటు చేయాల‌ని, రైతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఏర్పాట్లు ఉండాల‌ని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. గతంలో చాలా బాగా పనిచేసినారని ఇప్పుడు కూడా అలానే పని చేయాల‌ని తెలిపారు.

ఏఈఓలు నాణ్యమైన ధాన్యాన్ని ధృవీకరించిన తర్వాత తూకంలో ఎటువంటి కోత విధించడానికి వీలులేదని ఆదేశించారు. సీజన్‌లో బాయిల్డ్‌, రా రెండు రకాల‌ ధాన్యం వస్తుందన్నారు. ఆదేశాలు అధికారులు, కొనుగోలు కేంద్రాల‌ నిర్వహణ దారులు, రైస్ మిల్ల‌ర్లు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించాల‌ని ఎక్కడైనా తేడా వస్తే సంబంధితుల‌పై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డిసిఓ సింహాచలం, డిసిఎస్‌ఓ, డీఎస్‌ఓ, డిఆర్‌డిఓ, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కరోనా ఉదృతి నివారణకు విస్తృత చర్యలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేగంగా విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేయడానికి అధికారులు మరింత ...

Comment on the article