నిజామాబాద్, మార్చ్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక సంస్థలకు సంబంధించి నెల రోజుల్లో రెండు సంవత్సరాల ఆడిట్ వివరాలు సెటిల్ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్లో లోకల్ ఫండ్ ఆడిట్ అధికారులు, పంచాయతీ రాజ్ జిల్లా పరిషత్ ఎంపీడీవోలు దేవాదాయ శాఖ అధికారులతో పెండిరగ్ ఆడిట్ వివరాలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ప్రజల అవసరాలకు అనుగుణంగా స్థానిక సంస్థలలో సౌకర్యాలు కల్పిస్తూ ఆయా గ్రామ పంచాయతీలు మండ పరిషత్తు మున్సిపాలిటీలు జిల్లా పరిషత్ దేవాదాయ శాఖ పరిధిలో ఖర్చు చేయవలసి ఉన్నదని ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించి ఖర్చు చేస్తే అభ్యంతరాలు తెలియజేసి తగు చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు ఆడిట్ నిర్వహించడంతోపాటు సందర్భంగా వ్యక్తం చేసిన అభ్యంతరాలకు సంబంధిత కార్యాలయాల అధికారులు సమాధానాలు సమర్పించి ఆడిట్ పేరాలు డిస్పోజ్ చేయించుకోవాలని పెండింగ్ లేకుండా చూసుకోవాలని ఆయన ఆదేశించారు. 2018- 19, 2019 – 20 ఆర్థిక సంవత్సరాలకు గాను ఆడిట్ జరిగినందున సమాధానాలు ఇవ్వడానికి తగు సలహాలు, సూచనలు కొరకు ప్రతి మండలానికి ఒక ఆడిట్ అధికారిని సహాయంగా నియమించి ఒక నెల రోజుల ప్రత్యేక డ్రైవ్ చేపట్టి సరైన పద్ధతిలో సమాధానాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా లోకల్ ఫండ్ అధికారిని ఆదేశించారు.
ఎంపీడీవోలు వారి పరిధిలోని గ్రామ పంచాయతీలలో నిబంధనలు పాటిస్తూ ఖర్చు జరిగే విధంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఏ గ్రామ పంచాయతీలో కూడా అనవసర ఖర్చు జరగకుండా చూడాలని ఆడిట్ శాఖ ప్రతి రూపాయి సరైన పద్ధతిలో ఖర్చు జరుగుతుందో లేదో నిశిత పరిశీలన చేయాలని సూచించారు.
ఆడిట్ సందర్భంగా తప్పులను, అక్రమాలను ఎత్తి చూపినప్పుడు మాత్రమే ఆయా సంస్థలలో నిబంధనలకు అనుగుణంగా ఖర్చులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఆడిట్ అధికారి విజయ్ కుమార్, జిల్లా పరిషత్ సీఈవో గోవింద్, డిపిఓ జయసుధ, ఏడి మార్కెటింగ్, సంబంధిత శాఖల అధికారులు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021