Breaking News

ఆపరేషన్‌ నిమిత్తమై వృద్ధునికి రక్తదానం

కామారెడ్డి, మార్చ్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి వైద్యశాల‌లో ఎల్లారెడ్డికి చెందిన ల‌తీఫ్‌ (80) సంవత్సరాల‌ వృద్ధునికి ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు.

పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన కమ్మరి నరేష్‌ చారి మానవతా దృక్పథంతో స్పందించి ఓ పాజిటివ్‌ రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. కార్యక్రమంలో సురేష్‌, టెక్నీషియన్‌ చందన్‌ తదితరులున్నారు.

Check Also

కోవిడ్‌ కేర్‌ కేంద్రాలు రేపటి వరకు సిద్ధం చేసుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌లో కోవిడ్‌ కేర్‌ కేంద్రాలు ...

Comment on the article