Breaking News

నేడు మోర్తాడ్‌లో రథోత్సవం

మోర్తాడ్‌, మార్చ్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో శ్రీ ల‌క్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతరకు సంబంధించి వారం రోజుల‌ నుండి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా మోర్తాడ్‌లో మంగళవారం అర్ధరాత్రి రథోత్సవం జరగనుంది. జాతరకు చుట్టు పక్కల‌ మండలాల‌ నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. భక్తుల‌ సౌకర్యార్థం వారికి కావల‌సిన సౌకర్యాల‌ను గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

వివిధ గ్రామాల‌ నుండి వచ్చే భక్తుల‌కు ఎటువంటి అసౌకర్యం కల‌గకుండా గ్రామస్తులు వారికి సౌకర్యాలు కల్పించారు. గ్రామంలో గల‌ అతిపురాతన నాలుగు అంతస్తుల‌ రథాన్ని గ్రామ ప్రజల‌తో పాటు గ్రామాల‌ నుండి వచ్చిన భక్తులు లావుపాటి తాళ్లతో రథాన్ని లాగుతారు. రథాన్ని హై స్కూల్‌ గ్రౌండ్‌ వరకు తీసుకువచ్చి తిరిగి రాత్రి రెండుగంటల‌ సమయంలో శ్రీ వెంకటేశ్వర మందిరానికి తీసుకువెళ్తారు.

Check Also

మోర్తాడ్‌లో కుంటను మింగిన పెద్దలు

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో పంట పొలాల‌కు సాగునీరు అందించే ...

Comment on the article