నిజామాబాద్, మార్చ్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 31వ తేదీ బుధవారం ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జిల్లా కోర్టు రెండవ అంతస్తులో నిర్వహించనున్నట్టు ఎన్నికల అధికారులు రాజ్ కుమార్ సుబేదార్, డి వెంకట్ రమణ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్నికలు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించ బడుతాయి కావున ఓటు హక్కు వినియోగించుకునె సభ్యులు తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని, లేని పక్షంలో ఓటింగ్ హాల్లోకి అనుమతించబడదని స్పష్టం చేశారు. పోటీచేసే అభ్యర్థులు ఓటింగ్ హాలు నుండీ 100 అడుగుల లోపల ప్రచారం నిర్వహించరాదని, ఓటు వేసే వారిని ప్రలోభాలకు గురి చేయరాదన్నారు.
ఓటు వేసే అభ్యర్థులు తమ ఓటు క్రమ సంఖ్యను ముందుగానే నోటిస్ బోర్డులో పెట్టిన ఓటరు జాబితాలో తెలుసుకొని రావాలని సూచించారు. బార్ అసోసియేషన్ ఎన్నికలు సజావుగా నిర్వహించుటకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ శంకుస్థాపనలు - April 16, 2021
- నిజామాబాద్ జిల్లాకు 1000 డోసుల రెమెడెసివిర్ - April 16, 2021
- మహిళల భద్రతకై క్యూ.ఆర్.కోడ్ - April 16, 2021