Breaking News

క‌వుల‌కు ముఖ్య సూచ‌న‌…

నిజామాబాద్‌, మార్చ్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 75 సంవత్సరాల‌ స్వాతంత్య్రాన్ని పురస్కరించుకొని ఏప్రిల్‌ 3న స్వతంత్ర స్ఫూర్తి పై కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. బుధవారం తన చాంబర్‌లో సంబంధిత అధికారుల‌తో కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహణపై సమావేశం ఏర్పాటు చేసి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌ ఆదేశాల‌ మేరకు 75 సంవత్సరాల‌ స్వాతంత్య్రాన్ని పురస్కరించుకొని స్వతంత్ర భారత అమృతోత్సవ కార్యక్రమాలు 75 వారాల‌పాటు నిర్వహిస్తున్న నేపథ్యంతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఇందులో భాగంగా ఏప్రిల్‌ 3న నిజామాబాదు కొత్త అంబేద్కర్‌ భవన్‌లో సాయంత్రం ఐదు గంటల‌కు స్వతంత్ర స్ఫూర్తి అనే అంశంపై కవి సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమాల్లో పాల్గొనాల‌ని ఆసక్తి కలిగిన కవులు 25 – 30 పంక్తుల‌లో తెలంగాణ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ త్రివేణి (9951444803) కి కాని, ఉపాధ్యాయులు ఘనపురం దేవేందర్‌ (9948032705) కు కాని వారి కవితను వాట్సాప్‌ ద్వారా ఏప్రిల్‌ 1 వ తేదీన గురువారం సాయంత్రం వరకు పంపించాల‌ని సూచించారు. అట్టి కవిత వారి సొంతమే అని, ఎక్కడి నుండి కాపీ చేసినది కాదని ధ్రువీకరించి ఇవ్వాల‌ని తెలిపారు.

అంతేగాక ఒక ప్రింట్‌ కాపీ కవి సమ్మేళనం సందర్భంగా అధికారుల‌కు సమర్పించాల‌ని తెలిపారు. కవితల‌న్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని అర్హమైనవి అయి ఉంటే వాటిని పుస్తకరూపంలో భాష- సాంస్కృతిక శాఖ ద్వారా ముద్రించడం జరుగుతుందని తెలిపారు. అందువ‌ల్ల‌ కవితను ఎంపిక చేసుకునే ముందు స్వాతంత్య్రానికి ముందు తర్వాత అందుకు సంబంధించిన స్పూర్తిని అందుకు కృషిచేసిన మహనీయుల‌కు సంబంధించిన విషయాల‌ను కవిత ద్వారా వ్యక్తం చేసే విధంగా ఉండాల‌ని ఉత్తమంగా ఎంపికైన వాటిని మాత్రమే ముద్రణకు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుందని, అందువ‌ల్ల‌ కవితను ఎంపిక చేసుకునే ముందు అన్ని విషయాల‌ను దృష్టిలో ఉంచుకోవాల‌ని ఆయన కవుల‌కు సూచించారు.

ఏప్రిల్‌ 1వ తేదీ వరకు వచ్చిన కవితల‌ను కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. సమావేశంలో డీఇఓ దుర్గాప్రసాద్‌, తెలంగాణ విశ్వవిద్యాల‌యం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ త్రివేణి, కలెక్టర్‌ ఏవో సుదర్శన్‌, బాల‌ భవన్‌ సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌, విద్యా శాఖ తరపున నర్రా రామారావు, ఎం.ఇ.ఓ. రామారావు, రిటైర్డ్‌ డిపిఆర్‌ఓ రామ్మోహన్‌ రావు, రేడియో ఇంజనీర్‌ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Check Also

కరోనా ఉదృతి నివారణకు విస్తృత చర్యలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేగంగా విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేయడానికి అధికారులు మరింత ...

Comment on the article