ఆర్మూర్, మార్చ్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ. 5.93 కోట్లతో పచ్చల నడుకుడ చెక్ డ్యాం, కొత్తపల్లి చెక్ డ్యాం 7.73 కోట్లతో నిర్మించేందుకు శంకుస్థాపనలు చేశారు. రైతుల సౌకర్యార్థం రామన్నపేటలో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ దామాలు, రోడ్లు పునరుద్ధరణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం తెలంగాణలో ఉన్న అన్ని వాగులు, వంకల్లో ఎక్కడికక్కడ చెక్ డ్యాములు నిర్మించుకొని నీళ్లు నిలుపుకోవాలని, వాగులు వంకల్లో నీళ్ళు నిలువ ఉంటే పరిసర ప్రాంతాల గ్రామాలలోని బోర్లలో నీళ్లు వస్తాయనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో చెక్ డ్యాములు నిర్మాణం చేసుకుంటున్నామన్నారు.
రైతు కోసం వినూత్నమైన కార్యక్రమం దేశంలోనే ఎవరు చేయనటువంటి పని చెక్ డ్యాముల నిర్మాణం తీసుకోవడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో కప్పల వాగు 45 కిలోమీటర్లు బాల్కొండ నియోజకవర్గంలో మధ్యలో నుంచి పారుతుందని మంత్రి అన్నారు. 45 కిలోమీటర్ల వాగులో 22 చెక్ డ్యాములు ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ప్రతి సంవత్సరం మూడు చొప్పున మంజూరు చేసుకుంటూ ఇప్పటికీ 12 చెక్ డ్యాములు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు.
పది చెక్ డ్యాములకుగాను 6 చెక్ డ్యాములు మంజూరు చేసుకున్నాం, అవి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తొందరలోనే రామన్నపేట్ వేల్పూర్‌కు మధ్యలో కూడా 7 కోట్ల రూపాయలతో రామన్నపేట పై భాగంలో ఉట్నూర్ దగ్గర 8 కోట్ల రూపాయలతో రెండింటిని తొందరలోనే భూమి పూజ చేసుకొని నిర్మాణం మొదలు పెట్టుకుంటామన్నారు. వర్షాకాలం వానలు పడితే నీళ్లు ఆపుకొని వాగు నీళ్లతో నిండి ఉంటే ఒక సుందర దృశ్యం త్వరలోనే సంవత్సర కాలంలో మనం చూడబోతున్నాం అన్నారు.
వాగుకు ఇరువైపులా కిలోమీటర్ వరకు చెక్ డ్యామ్‌ల తో బోర్లు అన్ని రీఛార్జ్ చెయ్యి 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అంచనా ఉందన్నారు. ముఖ్యమంత్రి వినూత్నంగా దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ప్రతి గ్రామంలో ఒక వైకుంఠధామం ఉండాలని, ట్రాక్టర్, ట్యాంకర్ అన్ని గ్రామాలలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. నీళ్లు లేని వైకుంఠ ధామాలకు గ్రామ పంచాయతీ నుండి బోరు వేయించాలని డిపిఓను ఆదేశించారు.
గత సంవత్సరం ఏ విధంగా గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామో అదే విధంగా ఈసారి కూడా గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెట్టి కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందన్నారు. అందుకోసం 20 వేల కోట్ల రూపాయల రుణాన్ని కూడా బ్యాంకు నుంచి తీసుకొని తొందరలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. మొట్టమొదట కొనుగోలు కేంద్రం రామన్నపేట గ్రామంలో ఏర్పాటు చేస్తామన్నారు.
వాడి గ్రామంలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. కార్యక్రమాలలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అన్ని గ్రామాల సర్పంచులు ప్రజా ప్రతినిధులు, ఆర్డిఓ, ఎస్.ఇ. ఆర్అండ్బి రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, టిఆర్ డిఓ శ్రీనివాస్, డిపిఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ శంకుస్థాపనలు - April 16, 2021
- నిజామాబాద్ జిల్లాకు 1000 డోసుల రెమెడెసివిర్ - April 16, 2021
- మహిళల భద్రతకై క్యూ.ఆర్.కోడ్ - April 16, 2021