ఆర్మూర్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు గృహ నిర్మాణం శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. గురువారం జాగిర్యాల్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ నూతన భవనం ప్రారంభోత్సవం, భీంగల్ మున్సిపల్ కార్యాలయంలో కొత్త జెసిబి నడిపి ప్రారంభించారు. లింబాద్రి గుట్ట డబుల్ బిటి రోడ్డు ప్రారంభం, బాచన్ పల్లి వీడీసీ భవనం ప్రారంభం, ముచ్కూర్‌లో నూతన జిపి భవనం, పిహెచ్సి ...
Read More »Daily Archives: April 1, 2021
జిల్లాలో 442 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
నిజామాబాద్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు ఇబ్బంది కలిగించకూడదని ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా 442 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు – భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామంలో నిజామాబాద్ జిల్లాలోనే ఈ సీజన్లో మొట్టమొదటి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇది రాష్ట్రంలో కూడా మొదటి కొనుగోలు కేంద్రం కావచ్చన్నారు. రైతుకు ...
Read More »సర్వే ద్వారా భూముల పరిష్కారం
కామారెడ్డి, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాయింట్ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల సమస్యల పరిష్కారం జరుగుతుందని జుక్కల్ నియోజకవర్గం శాసనసభ్యులు హన్మంత్ షిండే తెలిపారు. గురువారం పెద్ద కొడపగల్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో జుక్కల్ నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సంబంధించి రెవెన్యూ అటవీ భూముల సమస్యలపై గ్రామాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ రైతులు ఎవరూ బాధపడవద్దని, వారి భూమికి సంబంధించిన హక్కు పత్రాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సర్వే ...
Read More »ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా చిలుక కిష్టయ్య
ఆర్మూర్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుగా ఎన్నికైన చిలుక కిష్టయ్యని వారి ఇంటికి వెళ్లి సన్మానించారు. కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు జెస్సు అనీల్, స్థానిక నాయకులు కొంతం మురళి, విజయనంద్, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
Read More »భూ కబ్జాపై విచారణ జరపాలి
ఆర్మూర్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మునిసిపల్ లో 9 కోట్ల టిఎండిపి నిధుల మిగులు బడ్జెట్లో ప్రస్తావన రానందున గురువారం జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఆర్మూర్, పెర్కిట్‌లో అక్రమ భూ కబ్జాలు, లే అవుట్లు యధేచగా చేస్తున్నందున దానిపై విచారణ జరపాలని కలెక్టర్‌ని కోరారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జివి నరసింహా రెడ్డి, సీనియర్ నాయకుడు ద్యగ ఉదయ్, కౌన్సిలర్లు ఆకుల ...
Read More »అందరు తప్పక వ్యాక్సిన్ తీసుకోవాలి
ఆర్మూర్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం భారతీయ జనతా పార్టీ మాక్లూర్ మండల శాఖ ఆధ్వర్యంలో దేశ ప్రధాని మోదీ ప్రజలందరికీ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ ను అందించాలనే ఉద్దేశంతో జరుగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి అవగాహన కల్పించే పోస్టర్‌ను జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి. నరసింహ రెడ్డి, ఆర్మూర్ కొవిడ్ కన్వీనర్ ద్యాగ ఉదయ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ వినయ్, మాక్లూర్ మండల నాయకులు సంతోష్, బిజెవైఎం ...
Read More »కార్మిక వ్యతిరేక కోడ్లను వెంటనే ఆపాలి
ఆర్మూర్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా సవరించి కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను హరించి వేయడాన్ని 2021 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలనే ఉత్తర్వులను వాపసు తీసుకోవాలని, జాతీయ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఆర్మూర్ పట్టణం పెర్కిట్ చౌరస్తాలో జీవో కాపీలను దగ్ధం చేసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. మోడీ అమిత్ షాలు ఎన్నికల వాగ్దానాన్ని విస్మరించి, ఉపాధి హక్కులను, సమ్మె చేసే హక్కు ...
Read More »అంబలి కేంద్రం ప్రారంభం
బాన్సువాడ, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రానున్న వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని బాన్సువాడ ప్రజలకోసం గురువారం బాన్సువాడ, తాడుకోల్ చౌరస్తాలోని గిర్మయ్య కాంప్లెక్స్ నందు తిరుమల రైస్ మిల్ యజమాని నాగులగామ వెంకన్న గుప్తా ఏర్పాటు చేసిన అంబలి కేంద్రం మరియు చలివేంద్రాన్ని ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రైతు బంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, ఏఎంసి చైర్మన్ పాత బాలకృష్ణ, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, బాన్సువాడ ప్యాక్స్ ...
Read More »వృద్దురాలికి రక్తదానం
కామారెడ్డి, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో అడవి లింగాల గ్రామానికి చెందిన సత్తవ్వ (65) అనే వృద్ధురాలికి ఆపరేషన్ నిమిత్తం బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. పట్టణ కేంద్రానికి చెందిన మెకానిక్ సతీష్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. గతంలో కూడా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడిన రక్తదాతను ...
Read More »