Breaking News

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ పరిష్కారం జరుగుతుందని జుక్కల్‌ నియోజకవర్గం శాసనసభ్యులు హన్మంత్‌ షిండే తెలిపారు. గురువారం పెద్ద కొడపగల్‌ మండల‌ కేంద్రంలోని రైతు వేదిక భవనంలో జుక్కల్‌ నియోజకవర్గంలోని ఆరు మండలాల‌కు సంబంధించి రెవెన్యూ అటవీ భూముల‌ సమస్యల‌పై గ్రామాల‌ వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ రైతులు ఎవరూ బాధపడవద్దని, వారి భూమికి సంబంధించిన హక్కు పత్రాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

సర్వే ల్యాండ్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా రెవెన్యూ అటవీ భూముల‌కు సంబంధించి త్వరలోనే జాయింట్‌ సర్వే పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల‌ ప్రకారం రెవెన్యూ, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ సంబంధించిన పట్టాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గత ఆరున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాల‌ ద్వారా 3.6 శాతం అటవీ శాతం పెరిగిందని, అటవీ భూముల‌ను కాపాడుకోవాల‌ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ మాట్లాడుతూ గత మూడు మాసాల‌ నుండి రెవెన్యూ అటవీ భూముల‌ను‌ సమీక్షించడం జరుగుతున్నదని తెలిపారు. రికార్డులు పరిశీలించడం సమస్యలు ఉన్న దానిని పక్కన పెట్టి మిగతా భూముల‌కు పట్టాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సర్వే ల్యాండ్‌ రికార్డు శాఖల‌తో జాయింట్‌ సర్వే జరుగుతుందని తెలిపారు. రిజిస్ట్రేషన్‌ సమస్యలు తీర్చడానికి ధరణి ప్రవేశపెట్టడం జరిగిందని, ధరణి రిజిస్ట్రేషన్‌లో కరెక్షన్స్‌ కూడా వచ్చాయని, గ్రామాల్లో ధరణి రిజిస్ట్రేషన్స్‌పై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.

అటవీ భూముల‌ను రక్షించుకోవాల‌ని‌, అటవీ భూములు ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌డివో రాజా గౌడ్‌, ఉమ్మడి జిల్లా అటవీ అధికారి సునీల్‌, జిల్లా సర్వే ల్యాండ్‌ రికార్డ్‌ ఎడి శ్రీనివాస్‌, తహశీల్దార్‌ సాయి భుజంగరావు, అటవీ అధికారులు, రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు, ఎంపీటీసీలు, సింగిల్‌విండో చైర్మన్‌లు పాల్గొన్నారు.

Check Also

వృద్దురాలికి రక్తదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల‌లో అడవి లింగాల‌ ...

Comment on the article