Breaking News

అంబలి కేంద్రం ప్రారంభం

బాన్సువాడ, ఏప్రిల్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని బాన్సువాడ ప్రజల‌కోసం గురువారం బాన్సువాడ, తాడుకోల్‌ చౌరస్తాలోని గిర్మయ్య కాంప్లెక్స్‌ నందు తిరుమల‌ రైస్‌ మిల్‌ యజమాని నాగుల‌గామ వెంకన్న గుప్తా ఏర్పాటు చేసిన అంబలి కేంద్రం మరియు చలివేంద్రాన్ని ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్‌ భాస్కర్‌ రెడ్డి ప్రారంభించారు.

కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రైతు బంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, ఏఎంసి చైర్మన్‌ పాత బాల‌కృష్ణ, బాన్సువాడ మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, బాన్సువాడ ప్యాక్స్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, బుడిమి ప్యాక్స్‌ చైర్మన్‌ పిట్ల శ్రీధర్‌, బాన్సువాడ గ్రామ రైతుబంధు అధ్యక్షుడు కొర్ల పొతు రెడ్డి, బాన్సువాడ మండల‌ ‌నాయకులు ఎజాజ్‌ ఖాన్‌, శివదయల్‌ వర్మ, కౌన్సిల‌ర్‌ నందకిషోర్‌, నార్ల ఉదయ్‌, రఫిక్‌, రేజ్వన్‌, కనుకుంట్ల రాజు, బోళ్లబోయిన శేఖర్‌, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Check Also

వ్యాయామశాలను పరిశీలించిన భాస్కర్‌రెడ్డి

బాన్సువాడ, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని హనుమాన్‌ ఆలయాన్ని శనివారం డిసిసిబి ఛైర్మన్‌ ...

Comment on the article