కామారెడ్డి, ఏప్రిల్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాకతీయ యూనివర్సిటీలో పరిశోధన విద్యార్థిగా కొనసాగుతున్న సునీల్ నాయక్ ఆత్మహత్య ప్రభుత్వ హత్యే అని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. కేసీఆర్ నిరుద్యోగుల పట్ల అనుసరిస్తున్న వైఖరి కారణంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యావంతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయని అనుకుంటే ఆత్మహత్యల తెలంగాణగా మార్చిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అబద్ధపు ప్రకటనలతో నిరుద్యోగులను అయోమయానికి గురి చేస్తున్నారని అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక లక్షా 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని మరొక మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఒక లక్ష 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, నిన్న దోమకొండలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ ఒక కోటి 32 లక్షల 500 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పిన ఎమ్మెల్యే దీనిపై 48 గంటలలో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నామన్నారు.
అసలు తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఇలాంటి అబద్ధపు మాటలతోనే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఇప్పటికైనా చిత్తశుద్ధితో రాష్ట్రంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచడంవల్లనే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఉండవనే బావన నిరుద్యోగులలో నెలకొని ఉందని, వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయకపోతే రానున్న రోజుల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను, మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరించారు.
కార్యక్రమంలో విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు నిజ్జన రమేష్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జన సమితి జిల్లా నాయకుడు కుంభాల లక్ష్మణ్ యాదవ్, రజినీకాంత్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ఏఎఫ్డిఎస్ రాష్ట్ర కార్యదర్శి జబ్బర్ నాయక్, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జి ఆకుల శివకృష్ణ పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021