ఆర్మూర్, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం ఎస్ఆర్ఎస్పి పుష్కర ఘాట్‌ను రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు గృహ నిర్మాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. శుక్రవారం ఒకటవ పుష్కర ఘాట్ దగ్గర జరిగిన దుర్ఘటన బాధాకరం, చాలా విచారకరమని, ఆ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబ సభ్యులను ఆదుకునే ప్రయత్నం చేస్తామన్నారు. పుష్కర ఘాట్‌లో ప్రతి శుక్రవారం దాదాపు ఐదువేల మంది ఇక్కడికి వచ్చి గంగా ...
Read More »Daily Archives: April 3, 2021
నిరుద్యోగులపై ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలి
నిజామాబాద్, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి బోడ సునీల్ నాయక్ ఆత్మ హత్యకు నిరసనగా నిజామాబాద్ ఎన్.ఎస్.యూ.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణు రాజ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరం ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వేణు రాజ్ మాట్లాడుతూ సునీల్ నాయక్ ది ముమ్మాటికీ ...
Read More »స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఘన విజయం సాధించారు. శనివారం హైదరాబాద్ లోని స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రధాన కార్యాలయంలో ఎన్నికలు జరగగా, ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర చీఫ్ కమీషనర్‌గా విజయం సాధించారని రిటర్నింగ్ ఆఫీసర్ మంచాల వరలక్ష్మి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా 2015 లో తొలిసారి స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా కవిత ఎన్నికయ్యారు.
Read More »