Breaking News

నిరుద్యోగుల‌పై ప్రభుత్వాల‌ మొండి వైఖరి నశించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఎన్‌.ఎస్‌.యూ.ఐ రాష్ట్ర అధ్యక్షుడు బ‌ల్మూ‌ర్‌ వెంకట్‌ ఆదేశాల‌ మేరకు వరంగల్‌ జిల్లా కాకతీయ విశ్వవిద్యాల‌య విద్యార్థి బోడ సునీల్‌ నాయక్‌ ఆత్మ హత్యకు నిరసనగా నిజామాబాద్‌ ఎన్‌.ఎస్‌.యూ.ఐ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణు రాజ్‌ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ నగరం ఎన్టీఆర్‌ చౌరస్తా వద్ద ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కే.సీ.ఆర్‌ దిష్టి బొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా వేణు రాజ్‌ మాట్లాడుతూ సునీల్‌ నాయక్‌ ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యగా తాము భావిస్తున్నామని, ఇటు కే.సీ.ఆర్‌ 2014 ఎన్నికల‌ సమయంలో తెలంగాణ యువతకి ల‌క్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగుల‌ ను దగా చేశాడని అటు మోడీ కూడా 2014 ఎన్నికల‌ సమయంలో దేశంలోని యువతకి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల‌ను కల్పిస్తామని చెప్పి నిరుద్యోగుల‌ను మోసం చేశాడని అన్నారు.

రాష్ట్రంలో, దేశంలో నిరుద్యోగం పెరిగి పోయిందని చదువుకున్న యువత ఆత్మహత్యకు పాల్ప‌డటానికి ముఖ్య కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగుల‌పై చూపిస్తున్న మొండి వైఖరే కారణమని అన్నారు. అలాగే నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు ఇవ్వక పోగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ముద్రలోన్స్‌ మరియు ఎస్‌సి, ఎస్‌టి, బీసి, మైనారిటీ నిరుద్యోగ యువతకు ఒక్కరికీ కూడా రుణాలు మంజూరు చేసి యువతని స్వయం ఉపాధి వైపు నడిపించటంలో విఫల‌మయ్యాయని ఆయన అన్నారు.

యువకులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌కి మాత్రం ఎన్నికల‌ మీద మాత్రమే శ్రద్ద ఉందని ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఉద్యోగ ప్రకటనలు వేస్తున్నామని చెప్పి ఎన్నికలు అయిపోయాక నిరుద్యోగుల‌ను పట్టించుకోవటం లేదని ఆయన ధ్వజమెత్తారు. సునీల్‌ నాయక్‌ మృతదేహాన్ని చూడటానికి గాని ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి గాని కెసిఆర్‌ గాని మంత్రి కేటీఆర్‌గాని ఆ జిల్లా మంత్రులు గాని, ఆ జిల్లా ఎమ్మెల్యేలు గాని కనీసం టీఆర్‌ఎస్‌ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళకపోగా ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించిన పాపాన పోలేదని ఆయన అన్నారు.

వెంటనే రాష్ట్ర ప్రభుత్యం సునీల్‌ నాయక్‌ కుటుంబానికి కోటి రూపాయల‌ నష్టపరిహారం మరియు ఆ కుటుంబంలో ఉన్న వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాల‌ని అలాగే సునీల్‌ నాయక్‌ డిమాండ్‌ చేసిన విధంగా రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కి రెండు ల‌క్షల‌ ఉద్యోగాల‌ను నోటిఫికేష‌న్లు విడుదల‌ చేయాల‌ని ఆయన డిమాండ్‌ చేశారు.

లేని పక్షంలో ఎన్‌.ఎస్‌.యూ.ఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నిరుద్యోగుల‌ను మరియు విద్యార్థుల‌ను ఏకం చేసి ప్రగతి భవన్‌ని ముట్టడిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ ఎన్‌.ఎస్‌.యూ.ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వరుణ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు భాను, వేదమిత్ర, నారన్‌ దీప్‌, దుర్గా ప్రసాద్‌ జిల్లా నాయకులు రమేష్‌ చంద్ర, సూర్య, సాయి, వికాస్‌, అనిల్‌, రాజు, గణేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కరోనా ఉదృతి నివారణకు విస్తృత చర్యలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేగంగా విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేయడానికి అధికారులు మరింత ...

Comment on the article