Breaking News

త్వరలో జల‌కళ…

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌ఆర్‌ఎస్‌పి పునర్జీవ పథకం కాలేశ్వరం రివర్స్‌ పంపింగ్‌ వద్ద నిర్మాణంలో ఉన్న పనుల‌ను రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి ఆదివారం పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎవరూ ఊహించని విధంగా ఎవ్వరూ చేయని విధంగా ముఖ్యమంత్రి ఎస్‌ఆర్‌ఎస్‌పి పునర్జీవ పథకాన్ని మొదలుపెట్టి పూర్తి చేయడం జరిగిందన్నారు.

300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాలేశ్వరం నుంచి నీళ్లను పైకి తీసుకొచ్చి వరద కాలువ ద్వారా రివర్స్‌ పంపింగ్‌చేసి శ్రీరామ్‌ సాగర్‌లో నీళ్లు నింపే కార్యక్రమం సీఎం కేసీఆర్‌ చేపట్టి కేవలం 2 వేల‌ కోట్ల రూపాయల‌తో 90 టీఎంసీల‌ శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్టు నింపే విధంగా వరద కాలువలో నిండా నీళ్లు పారుతున్నాయని ఎస్‌ఆర్‌ఎస్‌పి కెనాల్‌ కాకతీయ కెనాల్‌ నీళ్ళు చూసి ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.

ఎండాకాలం కాళేశ్వరం నీళ్ళు తీసుకువచ్చి శ్రీ రామ్‌ సాగర్‌లో వేయటానికి ఏర్పాట్లు చేయాల‌ని సీఎం ఆదేశించడం జరిగిందని తెలిపారు. ఒకటి రాంపూర్‌, రెండు రాజేశ్వర రావు పేట, మూడు ముప్కాల్‌లో రెండు పంపులు పూర్తి అయినవని దాని ద్వారా వరద కాలువకు సంవత్సరం నుండి నీళ్లు తెచ్చుకుంటున్నామన్నారు. మూడవ పంపు పని పూర్తయిందని నీళ్లు తెచ్చు కోవడానికి రెడీగా ఉందన్నారు.

8 మోటార్లతో 4 మోటార్లు పూర్తి అయినవని మిగతా నాలుగు పనులు పూర్తి అయి మోటార్‌ కనెక్షన్‌ ఇవ్వాల‌ని మంత్రి అన్నారు. ఎండాకాలంలో కాలేశ్వరం నీళ్లు తీసుకొచ్చి ఎస్‌ఆర్‌ఎస్‌పిలో వేయటానికి సీఎం ఆదేశించారన్నారు.

చీఫ్‌ ఇంజనీర్‌ సుధాకర్‌ రెడ్డి సమన్వయం చేస్తున్నారని, తొందరలోనే తెలంగాణ ప్రజలు గోదావరి నుంచి నీళ్లు రాకపోతే కింది నుంచి తెచ్చి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాల‌ని కార్య రూపం దాలుస్తుందని, ఇది తన పూర్వజన్మ సుకృతం అన్నారు. మంత్రి వెంట సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

అక్కడ ఒంటిపూట లాక్‌ డౌన్‌

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో మంగళవారం నుండి ఒంటిపూట లాక్‌ ...

Comment on the article