Breaking News

గల్ఫ్‌ సంఘాల‌ ప్రతినిధుల‌ కేరళ పర్యటన

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేరళలో పర్యటించిన అధికారుల‌ బృందం ఇచ్చే అధ్యయన నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో గల్ఫ్‌ కార్మికుల‌ సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇటీవలి బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో గల్ప్‌ ప్రవాసి సంఘాల‌ ప్రతినిధుల‌ బృందం కేరళలో పర్యటించనున్నట్లు గల్ప్‌ జెఏసి నాయకులు స్వదేశ్‌ పరికిపండ్ల ఒక ప్రకటనలో తెలిపారు.

ఈనెల‌ 8,9,10 మూడు రోజుల‌ పాటు కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో తమ బృందం నోర్కా, ఒడెపెక్‌, ప్రవాసి వెల్ఫేర్‌ బోర్డు లాంటి సంస్థ కార్యాల‌యాల‌ను సందర్శిస్తామని ప్రభుత్వ అధికారుల‌ను, కార్మిక సంఘాల‌ను, నిపుణుల‌ను కలుస్తామని స్వదేశ్‌ తెలిపారు.

గల్ప్‌ నుంచి వాపస్‌ వచ్చిన వల‌స కార్మికుల‌ పునరావాస కార్యక్రమాల అమలును పరిశీలిస్తారు. కేరళ ప్రభుత్వం గల్ప్‌ కార్మికుల‌కు అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాల‌ను స్వయంగా పరిశీలించి ఒక నివేదికను తయారుచేసి తెలంగాణ ప్రభుత్వానికి సమర్పిస్తామని ఆయన వివరించారు.

Check Also

కరోనా ఉదృతి నివారణకు విస్తృత చర్యలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేగంగా విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేయడానికి అధికారులు మరింత ...

Comment on the article