Breaking News

Daily Archives: April 5, 2021

చత్తీస్‌ఘడ్‌ అమర జవాన్లకు నివాళి

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఛత్తీస్‌ ఘడ్‌ బీజాపూర్‌లోని మావోయిస్టుల‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందిన సైనికుల‌ ఆత్మకు శాంతి చేకూరాల‌ని భారతీయ జనతా యువ మోర్చా కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల‌ స్తూపం వద్ద కొవ్వొత్తుల‌తో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేయం రాష్ట్ర నాయకుడు నరేంధర్‌ రెడ్డి మాట్లాడుతూ ఛత్తీస్‌ ఘడ్‌లో జరిగిన నక్సలైట్‌ దాడి అతిదారుణమైన సంఘటన అని దాడుల‌లో వీర మరణం పొందిన 22 మంది సైనికుల‌కు వినయపూర్వక శ్రద్ధాంజలి ...

Read More »

కామారెడ్డిలో సెంచరీ దాటిన కరోనా కేసులు

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో సోమవారం కరోనా కేసులు సెంచరీ దాటాయి. జిల్లా వ్యాప్తంగా 103 కేసులు నమోదు కాగా, 14,434 కు చేరుకుంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో జిల్లా ప్రజలు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. కరోనా బాధితుని ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు వివరాలు సేకరించడంలో అధికారులు విఫల‌మవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కరోనా ల‌క్షణాల‌తో మాస్కులు లేకుండానే ప్రజలు బయట తిరుగుతున్నారు. గత మార్చి నెల‌లో 464 కరోనా కేసులు నమోదు కాగా, గడిచిన ...

Read More »

ఆసుపత్రి మూసివేత

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో నిష్కల్‌ న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహిస్తున్న యజమాని డాక్టర్‌ నిష్కల్‌ ప్రభుకు కోవిడ్‌ పాజిటివ్‌ ఉన్నప్పటికీ అతను పేషెంట్లకు చికిత్సలు అందిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో ఆస్పత్రిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బందికి కోవిడ్‌ చికిత్సలు నిర్వహించగా ఆస్పత్రిలోని 30 మందికి, సిబ్బంది 10 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు డిఎంఅండ్‌హెచ్‌వో తెలిపారు. ఆసుపత్రి యజమాని ప్రభుకు కూడా ...

Read More »

గల్ఫ్ వల‌సల‌పై విదేశీ జర్నలిస్టుల‌ అధ్యయనం

జగిత్యా, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్ వల‌స కార్మికుల‌ ఆర్ధిక, సామాజిక జీవన స్థితిగతుల‌ను అధ్యయనం చేయడానికి డిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఇద్దరు విదేశీ జర్నలిస్టులు సోమవారం జగిత్యాల‌ జిల్లా మల్లాపూర్‌ మండలం ముత్యంపేట గ్రామాన్ని సందర్శించారు. నెదర్లాండ్స్‌కు చెందిన జర్నలిస్ట్‌ ఈవా ఔడె ఎల్ఫెరింక్‌, బ్రిటిష్‌ ఫోటో జర్నలిస్ట్‌ రెబెక్కా కాన్వే హైదరాబాద్‌కు చెందిన అనువాదకురాలు ప్రియాంక బృందానికి ప్రవాసి మిత్ర లేబర్‌ యూనియన్‌ అధ్యక్షుడు స్వదేశ్‌ పరికిపండ్ల సంధానకర్తగా, గైడ్‌గా వ్యవహరించారు. డచ్‌ జాతీయ దినపత్రిక ...

Read More »

రెండు ల‌క్షల‌ ఎకరాల‌కు సాగునీరు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్యాకేజీ 20 – 21 ద్వారా నాలుగు నియోజకవర్గాల‌లోని రెండు ల‌క్షల‌ ఎకరాల‌కు సాగునీరు అందించడానికి పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల‌ శాఖ మాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన రూరల్‌ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌, సంబంధిత గుత్తేదారులు, అధికారుల‌తో కలిసి సారంగాపూర్‌, మంచిప్ప, గడ్కోల్‌, మెంట్రాజ్‌ పల్లి, భూపాపల్లి తదితర ప్రాంతాల‌లో పైపులైన్ల పనులు, కాలువ‌ల‌ పనులు ఇతర పనుల‌ను పరిశీలించారు. ఈ ...

Read More »

కలెక్టరేట్‌లో జగ్జీవన్‌ రామ్‌ జయంతి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ నిబంధనల‌ నేపథ్యంలో బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి జిల్లా యంత్రాంగం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించారు. సోమవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు జగ్జీవన్‌ రామ్‌ చిత్రపటానికి పూల‌మాల‌వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, అడిషనల్‌ కలెక్టర్ ల‌త, ఆర్‌డిఓ రవికుమార్‌, యస్‌సి కార్పొరేషన్‌ ఈడి రమేష్‌, ...

Read More »

బడుగుల‌ ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్‌ రామ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అణగారిన ప్రజల‌ ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్‌ రామ్‌ అని, ఆయన ఆశయాల‌ను అనుగుణంగా ముందుకు వెళ్ళడమే మన ముందున్న ల‌క్ష్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. మాజీ ఉప ప్రధాని, స్వాతంత్య్ర సమరయోధులు బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతిని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాల‌ను ఏర్పాటు చేయగా సోమవారం నగరంలోని ఆయన విగ్రహానికి అధికారులు, అభిమానులు, ప్రజాప్రతినిధుల‌తో కలిసి ...

Read More »

రజకుల‌ హర్షం

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ కేంద్రంలో అంబేద్కర్‌ చౌరస్తా వద్ద తెలంగాణ రజక సంఘాల‌ సమితి రాష్ట్ర కన్వీనర్‌ మానస గణేష్‌ ఆధ్వర్యంలో కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రజకుల‌కు 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ జివో జారీ చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి చిత్రపటాల‌కు క్షీరాభిషేకం చేశారు. మానస గణేష్‌ మాట్లాడుతూ రజకుల‌ ఆర్థిక స్థితిగతుల‌ను చూసి వారిని ఆర్థికంగా ఆదుకోవాల‌నే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ...

Read More »

250 యూనిట్ల వరకు నాణ్యమైన ఉచిత విద్యుత్తు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని క్షవర వృత్తి శాలల‌కు (కటింగ్‌ షాపుల‌కు), లాండ్రీ షాపుల‌కు, దోభీఘాట్లకు నెల‌కు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ఇవ్వాల‌ని సీఎం కె. చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వానికి ఇప్పటికే చేసిన విజ్జప్తుల‌ను పరిశీలించిన మీదట సీఎం నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందుకు సంబంధించి తక్షణమే జీవో జారీ చేయాల్సిందిగా సీఎంఓ కార్యదర్శి భూపాల్‌ రెడ్డికి సీఎం ఆదేశించారు. ...

Read More »