Breaking News

బడుగుల‌ ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్‌ రామ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అణగారిన ప్రజల‌ ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్‌ రామ్‌ అని, ఆయన ఆశయాల‌ను అనుగుణంగా ముందుకు వెళ్ళడమే మన ముందున్న ల‌క్ష్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. మాజీ ఉప ప్రధాని, స్వాతంత్య్ర సమరయోధులు బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతిని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాల‌ను ఏర్పాటు చేయగా సోమవారం నగరంలోని ఆయన విగ్రహానికి అధికారులు, అభిమానులు, ప్రజాప్రతినిధుల‌తో కలిసి మంత్రి పూల‌మాల‌వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబు జగజీవన్‌ రామ్‌ బడుగు బల‌హీన వర్గాల‌ ప్రజల‌ కోసం పాటు పడిన వ్యక్తి అని, నిరుపేద గ్రామీణ కుటుంబ నుండి వచ్చినాడని, జీవితాంతం తన ఆశయాల‌ కోసం పోరాడిన వ్యక్తి అని కొనియాడారు. డాక్టర్‌ బి ఆర్‌ అంబెడ్కర్‌ రచించిన రాజ్యాంగం ద్వారా దేశంలోని బడుగు బల‌హీన వర్గాల‌ వారి కోసం తయారు చేసిన రిజర్వేషన్ అమలు బాధ్యతను బాబు జగజీవన్‌ రాం తన భుజాల‌పై వేసుకొన్నారన్నారు.

బాబు జగజీవన్‌ రాం సుదీర్ఘంగా 35 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా 5 దశాబ్దాలు పార్లమెంట్‌ సభ్యుగా పని చేశారన్నారు. ఆయన ఆశయాల‌ స్పూర్తితోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ బడుగు బల‌హీన వర్గాల‌ వారి కొరకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి వివరించారు.

జగ్జీవన్‌ రామ్‌ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, సిపి కార్తికేయ, అడిషనల్‌ కలెక్టర్ ల‌త, మున్సిపల్‌ కమీషనర్‌ జితేష్‌ వి. పాటిల్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, రవికుమార్‌ ఆర్‌డిఓ, యస్‌సి కార్పొరేషన్‌ ఈడి రమేష్‌, డిఎస్‌సిడివో శశికళ సహాయ అధికారి, ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కరోనా ఉదృతి నివారణకు విస్తృత చర్యలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేగంగా విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేయడానికి అధికారులు మరింత ...

Comment on the article