Breaking News

ఆసుపత్రి మూసివేత

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో నిష్కల్‌ న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహిస్తున్న యజమాని డాక్టర్‌ నిష్కల్‌ ప్రభుకు కోవిడ్‌ పాజిటివ్‌ ఉన్నప్పటికీ అతను పేషెంట్లకు చికిత్సలు అందిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో ఆస్పత్రిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బందికి కోవిడ్‌ చికిత్సలు నిర్వహించగా ఆస్పత్రిలోని 30 మందికి, సిబ్బంది 10 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు డిఎంఅండ్‌హెచ్‌వో తెలిపారు.

ఆసుపత్రి యజమాని ప్రభుకు కూడా కోవిడ్‌ పరీక్షలు నిర్వహించబోగా ఆయన తప్పించుకొని పోయాడని డాక్టర్‌ సుదర్శనం వివరించారు. రెండు గంటలు వేచి చూసినప్పటికీ డాక్టర్‌ రాకపోయేసరికి ఆసుపత్రిని మూసివేయించామని పేర్కొన్నారు. తనిఖీ సందర్భంగా డాక్టర్‌ రాజేష్‌ డెమో, గంగాధర్‌, గోవర్ధన్‌, భూమన్న, ఏఎన్‌ఎం రాజమణి, సిబ్బంది, ఉన్నారని తెలిపారు.

Check Also

ఈజీఎస్‌ ద్వారా గ్రామాల‌కు మంచి పనులు జరగాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకం ద్వారా కూలీల‌కు కూలీ ల‌భించడమే ...

Comment on the article