నిజామాబాద్, ఏప్రిల్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్యాకేజీ 20 – 21 ద్వారా నాలుగు నియోజకవర్గాలలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, సంబంధిత గుత్తేదారులు, అధికారులతో కలిసి సారంగాపూర్, మంచిప్ప, గడ్కోల్, మెంట్రాజ్ పల్లి, భూపాపల్లి తదితర ప్రాంతాలలో పైపులైన్ల పనులు, కాలువల పనులు ఇతర పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సాగునీరు సదుపాయం లేని నిజామాబాద్ రూరల్ , ఆర్మూర్, బాల్కొండ , మెట్పల్లి నియోజకవర్గాల పరిధిలోని మంచిప్ప, గడుకోల్, సిరికొండ, డిచ్పల్లి, ఇందల్వాయి, మోపాల్ మండలాలు అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్, మోర్తాడ్, భీమ్గల్ తదితర మండలాల్లోనూ, ఆర్మూర్ నియోజకవర్గంలోని జక్రాన్పల్లి మండలంలో, మెట్పల్లి నియోజకవర్గంలోనూ అన్నింటా కలిపి రెండు లక్షలపైగా ఎకరాలకు నీరు అందించడానికి పనులు వేగవంతం చేయడంలో ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారని తెలిపారు.
ఇందులో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఒక లక్షా 20 వేల ఎకరాలు, బాల్కొండ నియోజకవర్గంలో 80 వేలు, ఆర్మూర్లో 6 వేలు, మెట్పల్లిలో 20 వేల ఎకరాలకు నీరు అందించడానికి ప్యాకేజీలు ఉద్దేశించడం జరిగిందని తెలిపారు. బినోల నుండి ఎస్ఆర్ఎస్పి వెనుక భాగంలో టన్నెల్ ద్వారా నీరు తెచ్చి మాసాని దగ్గర నిజాంసాగర్ ప్రాజెక్టు కెనాల్ వద్ద లిఫ్ట్ చేసి అక్కడినుండి మెంట్రాజ్పల్లి పంప్ హౌస్కు పంపించడం జరుగుతుందని వివరించారు.
మెట్పల్లి – మెంట్రాజ్ పల్లి పంపు లైన్ పూర్తి కావచ్చిందని గడ్కోల్ లైన్ మంచిప్ప చెరువు దగ్గర రెండు పంప్ హౌస్లు ఏర్పాటు చేస్తున్నామని ఒకటి నీరు పోస్తుందని మరొకటి పంప్ హౌస్ నుండి నీటిని పైకి లిఫ్ట్ చేస్తుందని మెంట్రాజ్పల్లి పంప్ హౌస్ ఒకటిన్నర నెలలో పూర్తవుతుందని తెలిపారు. జక్రాన్పల్లి, వేల్పూర్, భీమ్గల్, ఆర్మూర్ ప్రాంతాలలోని 20 వేల ఎకరాలకు నీటిని అందించే ప్యాకేజీ 21 జులై కల్లా పూర్తి చేయించడానికి ఆదేశించడం జరిగిందని తెలిపారు.
ముఖ్యంగా పైపులైన్లు వచ్చే భూములు రైతులను తాను, శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, కోరేది ఏమనగా తెలంగాణ రాష్ట్రంలో పైపులైన్ ద్వారా మీరిచ్చే సదుపాయం మన దగ్గర తప్ప ఇతర జిల్లాల లేదని రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పనులు నిర్వహించడం జరుగుతుందని, వారి భూముల ద్వారా వెళ్లే పైపులైన్లకు అధికారులు, కాంట్రాక్టర్లు నిర్వహించే పనులకు సంబంధిత రైతులు సహకరించాలని ఇందుకు సంబంధిత గ్రామాల జెడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపీటిసిలు, సొసైటీ అధ్యక్షులు, సర్పంచులు రైతులకు వివరించి సహకరించే విధంగా చూడాలని తర్వాత పొలాలలో పంటలు వేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని తాము ముగ్గురం కూడా చేతులెత్తి కోరుతున్నామని తెలిపారు.
మంత్రి వెంట శాసన సభ్యులతో పాటు మెగా, నవయుగ ఇంజనీరింగ్ ప్రతినిధులు, సీఈ మధుసూదన్ రావు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ శంకుస్థాపనలు - April 16, 2021
- నిజామాబాద్ జిల్లాకు 1000 డోసుల రెమెడెసివిర్ - April 16, 2021
- మహిళల భద్రతకై క్యూ.ఆర్.కోడ్ - April 16, 2021