Breaking News

కలెక్టరేట్‌లో జగ్జీవన్‌ రామ్‌ జయంతి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ నిబంధనల‌ నేపథ్యంలో బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి జిల్లా యంత్రాంగం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించారు. సోమవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు జగ్జీవన్‌ రామ్‌ చిత్రపటానికి పూల‌మాల‌వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, అడిషనల్‌ కలెక్టర్ ల‌త, ఆర్‌డిఓ రవికుమార్‌, యస్‌సి కార్పొరేషన్‌ ఈడి రమేష్‌, డిఎస్‌సిడిఓ శశికళ, కలెక్టరేట్‌ ఏవో సుదర్శన్‌, భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కరోనా ఉదృతి నివారణకు విస్తృత చర్యలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేగంగా విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేయడానికి అధికారులు మరింత ...

Comment on the article