నిజామాబాద్, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు కూలీ లభించడమే కాకుండా ఆయా గ్రామాలకు మంచి పనులు కూడా చేసి పెట్టాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం సెల్ కాన్ఫరెన్సు ద్వారా ఉపాధి హామీ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు నెలలపాటు కూలీల కోసం అదేవిధంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు జరిగే విధంగా కృషి చేయాలని తెలిపారు. ప్రతి గ్రామంలో 40 శాతం పైగా అంటే ...
Read More »Daily Archives: April 6, 2021
శ్రీనివాస్‌కు డాక్టరేట్
డిచ్పల్లి, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగపు పరిశోధక విద్యార్థి ఎ. శ్రీనివాస్‌కు పిహెచ్.డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో పని చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆంగ్ల విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డా.సవీన్ సౌదా పర్యవేక్షణలో ‘‘నియో స్లేవ్ నేరటీవ్స్ ఇన్ సెలెక్ట్ నావెల్స్ బై ఎడ్వార్డ్ జోన్స్ అండ్ టోని మోరిసన్’’ అనే అంశంపై పిహెచ్. డి. పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించి తెలంగాణ విశ్వవిద్యాలయానికి సమర్పించారు. ...
Read More »కోవిడ్ చికిత్సలకు సిద్ధం కండి
నిజామాబాద్, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశవ్యాప్తంగా, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కోవిడ్ కేసులు విస్తృతంగా పెరుగుతున్నందున ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు అనుమతించిన ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా తిరిగి పెద్ద సంఖ్యలో సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలని, ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలను కోరారు. మంగళవారం తన ఛాంబర్లో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో కోవీడు వ్యాప్తిపై, తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజురోజుకు వైరస్ ఉదృతి ఆందోళనకరంగా కనిపిస్తున్నదని ...
Read More »సిఎం చిత్రపటానికి పాలాభిషేకం
మోర్తాడ్, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలోని రజకులందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 250 యూనిట్ల నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా ఇస్తున్నందుకు మంగళవారం మోర్తాడ్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తును సరఫరా చేయడం చాలా సంతోషమని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ...
Read More »రాష్ట్ర మహాసభ జయప్రదం చేయండి
నిజామాబాద్, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) ఆధ్వర్యంలో మంగళవారం యూనియన్ కార్యాలయం, కోటగల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టీ.యూ జిల్లా నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రథమ మహాసభ ఈనెల 11న సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాదులో జరుగనుందన్నారు. రాష్ట్ర మహాసభకు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణ, కే.సూర్యం తదితరులు అతిథులుగా వస్తున్నారన్నారు. రాష్ట్ర ...
Read More »టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ పెరగాలి
నిజామాబాద్, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పరిస్థితి ఆందోళనకరంగా మారవచ్చు – కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ఎన్ఫోర్సుమెంట్ విస్తృత తనిఖీలు చేయాలి, బయట తిరిగే ప్రజలందరూ మాస్కు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించాలి, వ ృద్ధులు, వ్యాధిగ్రస్తులకు దీని ప్రమాదం ఎక్కువగా ఉన్నందున వీరిలో ఎక్కువమందికి వ్యాక్సినేషన్ జరగాలి, టెస్టులు పెరగాలి- అప్పుడే వైరస్ అరికట్టడానికి వీలవుతుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్సు హాల్లో తన ఛాంబర్లో వేరువేరుగా సంబంధిత ...
Read More »కరోనా ఉదృతి నివారణకు విస్తృత చర్యలు
నిజామాబాద్, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేగంగా విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేయడానికి అధికారులు మరింత విస్తృత ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్రస్థాయి అధికారులైన రిజ్వి, రాహుల్ బొజ్జా, రోనాల్డ్ రోస్, డాక్టర్ ప్రీతిమీనా, డాక్టర్ శ్రీనివాస రావుతో కలిసి కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వ ...
Read More »