Breaking News

కరోనా ఉదృతి నివారణకు విస్తృత చర్యలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేగంగా విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేయడానికి అధికారులు మరింత విస్తృత ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లను సంబంధిత శాఖల‌ అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌ నుండి రాష్ట్రస్థాయి అధికారులైన రిజ్వి, రాహుల్‌ బొజ్జా, రోనాల్డ్‌ రోస్‌, డాక్టర్‌ ప్రీతిమీనా, డాక్టర్‌ శ్రీనివాస రావుతో కలిసి కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల‌పై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వ ఆసుపత్రుల‌ సూపరింటెండెంట్స్‌, జిల్లా పరిషత్‌ సీఈఓలు, డిఆర్‌డిఓల‌తో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్‌ వైరస్‌ గత సంవత్సరం కంటే సెకండ్‌ వేవ్‌ ప్రస్తుతం ఆందోళనకరంగానే విస్తరిస్తున్నదని దీనికి మరిన్ని చర్యల‌తో, ఏర్పాట్లతో నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరమున్నదని తెలిపారు. ఇందులో భాగంగా వృద్ధులు, వ్యాధిగ్రస్తుల‌కు ప్రధానంగా వ్యాక్సినేషన్‌ సంఖ్యను పెంచాల‌ని పరీక్షల‌ను కూడా ఎక్కువ సంఖ్యలో నిర్వహించడానికి చర్యలు తీసుకోవాల‌ని పాజిటివ్‌ వచ్చినవారికి హోమ్‌ ట్రీట్మెంట్‌ కిట్స్‌ అందించాల‌ని కోరారు. కోవిడ్‌ కేర్‌ కేంద్రాల‌లో సేవ‌లు 24 గంటలు ల‌భించే విధంగా చర్యలు తీసుకోవాల‌ని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రిలో మరింత ఎక్కువ మందికి కోవిడ్‌ చికిత్స అందించడానికి సిద్ధం చేయాల‌ని పేర్కొన్నారు.

అదేవిధంగా ప్రభుత్వం జారీ చేసిన 69 జీవో ప్రకారం బయట తిరిగే ప్రతి ఒక్కరు కూడా మాస్కు ధరించే విధంగా సామాజిక దూరం పాటించే విధంగా కట్టడి చేయాల‌ని మతపరమైన కార్యక్రమాలు, ఫంక్షన్స్‌లో ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఒకే చోట చేరకుండా నిబంధనలు అతిక్రమించకుండా కఠిన చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో వ్యాక్సినేషన్‌ చేస్తున్న 44 ఆస్పత్రుల‌లో ప్రభుత్వ ఆదేశాల‌ ప్రకారం మరింత ఎక్కువ మందికి వ్యాక్సినేషన్‌ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, పరీక్షలు పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రభుత్వ- ప్రైవేటు ఆసుపత్రుల‌లో కోవిడ్‌ చికిత్సకు మరింత ఎక్కువ మందికి సేవ‌లు అందించే విధంగా సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేస్తామని, ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్‌ ధరించి వెళ్లే విధంగా, సామాజిక దూరం పాటించే విధంగా ఇప్పటికే అధికారులు తనిఖీలు చేస్తున్నారని వివరించారు.

వీడియో కాన్పరెన్సులో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, ల‌త, డిఎంహెచ్‌వో సుదర్శనం, నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌, ప్రభుత్వ ఆసుపత్రుల‌ సూపరింటెండెంట్స్‌ ప్రతిమారాజ్‌, నీలిమ, రమేష్‌, డిపిఓ జయసుధ, జిల్లా పరిషత్‌ సీఈవో గోవింద్‌, డిఎస్‌సిడిఓ శశికళ, మైన్స్‌ అండ్‌ జియాల‌జీ సహాయ సంచాల‌కులు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆసుపత్రి మూసివేత

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో నిష్కల్‌ న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ...

Comment on the article