నిజామాబాద్, ఏప్రిల్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశవ్యాప్తంగా, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కోవిడ్ కేసులు విస్తృతంగా పెరుగుతున్నందున ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు అనుమతించిన ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా తిరిగి పెద్ద సంఖ్యలో సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలని, ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలను కోరారు. మంగళవారం తన ఛాంబర్లో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో కోవీడు వ్యాప్తిపై, తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజురోజుకు వైరస్ ఉదృతి ఆందోళనకరంగా కనిపిస్తున్నదని పరిస్థితిని కొంత సీవియర్ గానే చూడాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 172 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. మరికొన్ని రోజుల్లో మరింత విస్తృతమయ్యే అవకాశం ఉన్నందున పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స అందించడానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు సేవలందించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
ఆసుపత్రుల యాజమాన్యాలు అందించిన వివరాల ప్రకారం సుమారు వందమంది ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుందని, ఈ ఆసుపత్రులలో సుమారు 400 మందికి చికిత్సను అందించడానికి అవసరమైన బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. వ్యాక్సినేషన్ వేసిన వారిలో కూడా కొందరికి వైరస్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వేసుకున్న వారికి వేసుకోని వారికి లక్షణాలలో తేడాలున్నాయని వేసుకున్న వారికి ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్నందున ప్రమాదం లేదన్నారు.
అదేవిధంగా వాక్సినేషన్ జరుగుతున్న ప్రైవేటు ఆసుపత్రులలో ప్రతిరోజు కనీసం వంద మందికి తక్కువ కాకుండా వ్యాక్సిన్ వేసే విధంగా వారి వద్దకు వచ్చే ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సినేషన్ విషయంలో రేటింగ్ ఇస్తామని తక్కువ వేసే ఆస్పత్రులను క్యాన్సల్ చేస్తామని అందువల్ల యాజమాన్యాలు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వృద్ధులు వివిధ రకాల వ్యాధిగ్రస్తులకు ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ వేయడానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎందుకంటే వారిపైనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని సీరియస్ నెస్ కూడా ఉంటుందని వివరించారు.
ఆస్పత్రిలో పనిచేసే ప్రతి ఒక్కరికి 100 శాతం రెండు డోస్‌లు వ్యాక్సినేషన్ తప్పనిసరిగా తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక ఆసుపత్రి ప్రధాన డాక్టర్ తనకు వైరస్ ఉన్నప్పటికీ ఆసుపత్రిలో చికిత్స అందించడంపై కలెక్టర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రతి ఆస్పత్రిలో కూడా కోవిడ్ ప్రోటోకాల్ పాటించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే ఆ ఆసుపత్రులపై గట్టి చర్యలు ఉంటాయని తెలిపారు.
వ్యాక్సిన్ వృధా కాకుండా ప్రైవేట్ ఆసుపత్రులు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని వారి వద్ద వ్యాక్సిన్ వేసుకునే వారు ఉంటే వారి వివరాలు లేదా ఇంకా కొంత వ్యాక్సిన్ మిగిలి ఉంటే ఆ వివరాలు గ్రూపులో నమోదు చేయడం ద్వారా ఒకరికొకరు సహకరించడంతో పాటు వ్యాక్సిన్ వృధా కాకుండా ఉంటుందని సూచించారు. ఇందుకు వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఎంహెచ్వో సుదర్శనం, డాక్టర్ తుకారాం, డాక్టర్ రాజేష్, ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ శంకుస్థాపనలు - April 16, 2021
- నిజామాబాద్ జిల్లాకు 1000 డోసుల రెమెడెసివిర్ - April 16, 2021
- మహిళల భద్రతకై క్యూ.ఆర్.కోడ్ - April 16, 2021