Breaking News

ఈజీఎస్‌ ద్వారా గ్రామాల‌కు మంచి పనులు జరగాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకం ద్వారా కూలీల‌కు కూలీ ల‌భించడమే కాకుండా ఆయా గ్రామాల‌కు మంచి పనులు కూడా చేసి పెట్టాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా ఉపాధి హామీ సంబంధిత అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు నెల‌లపాటు కూలీల‌ కోసం అదేవిధంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు జరిగే విధంగా కృషి చేయాల‌ని‌ తెలిపారు.

ప్రతి గ్రామంలో 40 శాతం పైగా అంటే రెండు వందల‌ మందికి మించి కూలీల‌కు పనులు ల‌భించేలా చూడాల‌ని, అంతేగాక గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ పథకం ద్వారా నిర్వహించాల‌ని పేర్కొన్నారు. తద్వారా ఆ గ్రామాల‌కు శాశ్వత అసెట్స్‌ ఉండిపోతాయని తెలిపారు. వాళ్లతో పాటు ఆయా పనుల‌కు సంబంధించి ఫైల్స్‌ నిబంధనల‌ మేరకు అన్ని విషయాల‌తో నిర్వహించాల‌ని గ్రామపంచాయతీ తీర్మానాలు సాంక్షన్‌ లెటర్‌లు ఉండాల‌ని కూలీల‌ వివరాలు చెల్లింపుల‌ వివరాలు పనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా పొందుపరచబడి ఉండాల‌ని ఎప్పుడైనా తనిఖీకి వచ్చినప్పుడు ఎటువంటి లోటుపాట్లను ఎత్తి చూపే విధంగా ఉండకూడదని తెలిపారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ బోగస్‌ ఫిగర్స్‌ ఉండకుండా చర్యలు తీసుకోవాల‌న్నారు. ముందు ముందు మరింత మంది లేబర్‌ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల‌ని వారికి ఈ మూడు నెల‌లు పనులు కల్పించడం ప్రధానమని పేర్కొన్నారు. సెల్‌ కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ ల‌త, డిఆర్‌డిఓ శ్రీనివాస్‌, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆసుపత్రి మూసివేత

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో నిష్కల్‌ న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ...

Comment on the article