Breaking News

రాష్ట్ర మహాసభ జయప్రదం చేయండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రగతిశీల‌ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో మంగళవారం యూనియన్‌ కార్యాల‌యం, కోటగల్లీలో ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఐ.ఎఫ్‌.టీ.యూ జిల్లా నాయకులు ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రగతిశీల‌ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రథమ మహాసభ ఈనెల‌ 11న సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాదులో జరుగనుందన్నారు. రాష్ట్ర మహాసభకు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణ, కే.సూర్యం తదితరులు అతిథులుగా వస్తున్నారన్నారు.

రాష్ట్ర ప్రథమ మహాసభను జయప్రదం చేయాల‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ మున్సిపల్‌ కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన వేతనాల‌ పెంపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ అవుట్సోర్సింగ్‌ కార్మికులందరికీ కనీస వేతనం అమలు చేసి, 30శాతం వేతన పెంపు వర్తింపజేయాల‌న్నారు.

రెగ్యుల‌ర్‌ ఉద్యోగుల‌ మాదిరిగానే కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ ఉద్యోగ, కార్మికుల‌కు అన్ని రకాల‌ సదుపాయాలు కల్పించాల‌న్నారు. కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ పర్మినెంట్‌ చేయాల‌ని డిమాండ్‌ చేశారు. మహాసభలో మున్సిపల్‌ కార్మికుల‌ సమస్యలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల‌ కార్మిక వ్యతిరేక విధానాల‌పై చర్చించి ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. సమావేశంలో యూనియన్‌ నాయకులు రాజేశ్వర్‌, శాంతికుమార్‌, తిరుపతి, చరణ్‌, విఠల్‌ పాల్గొన్నారు.

Check Also

ఆసుపత్రి మూసివేత

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో నిష్కల్‌ న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ...

Comment on the article