మోర్తాడ్, ఏప్రిల్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలోని రజకులందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 250 యూనిట్ల నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా ఇస్తున్నందుకు మంగళవారం మోర్తాడ్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తును సరఫరా చేయడం చాలా సంతోషమని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అన్ని పేదల పక్షాన ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రజక యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ శంకుస్థాపనలు - April 16, 2021
- నిజామాబాద్ జిల్లాకు 1000 డోసుల రెమెడెసివిర్ - April 16, 2021
- మహిళల భద్రతకై క్యూ.ఆర్.కోడ్ - April 16, 2021