Breaking News

టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్మెంట్‌, వ్యాక్సినేషన్‌ పెరగాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిస్థితి ఆందోళనకరంగా మారవచ్చు – కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఎన్‌ఫోర్సుమెంట్‌ విస్తృత తనిఖీలు చేయాలి, బయట తిరిగే ప్రజలందరూ మాస్కు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించాలి, వ ృద్ధులు, వ్యాధిగ్రస్తుల‌కు దీని ప్రమాదం ఎక్కువగా ఉన్నందున వీరిలో ఎక్కువమందికి వ్యాక్సినేషన్‌ జరగాలి, టెస్టులు పెరగాలి- అప్పుడే వైరస్‌ అరికట్టడానికి వీల‌వుతుందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు.

మంగళవారం వీడియో కాన్ఫరెన్సు హాల్‌లో తన ఛాంబర్‌లో వేరువేరుగా సంబంధిత అధికారుల‌తో సమావేశం సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించి కరోనా ఉధృతిని నివారించడానికి తీసుకోవల‌సిన చర్యల‌పై పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఒకేచోట చేరకుండా, ప్రతి ఒక్కరు మాస్క్లు ధరించే విధంగా, సామాజిక దూరం పాటించే విధంగా ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ టీములు చర్యలు తీసుకోవాల‌ని పేర్కొన్నారు.

పోలీస్‌, మున్సిపల్‌, గ్రామపంచాయతీ, మండల‌ స్థాయి అధికారుల‌తో ఈ టీమ్‌లు ఏర్పడి ఎక్కడికక్కడ వైరస్‌ ఉధ్రుతిని కట్టడి చేయడానికి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాల‌ని సూచించారు. ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వైరస్‌ పరీక్షలు పెంచడానికి అవసరమైన ఏర్పాటు చేయాల‌న్నారు. అన్ని ప్రాంతాల‌లో పరీక్షలు పెద్ద సంఖ్యలో చేయడంతోపాటు వైరస్‌ సోకిన వారిని గుర్తించి వారిని హోమ్‌ ఐసోలేషన్‌, క్వారంటైన్‌ హోమ్‌లో చికిత్సలు తీసుకునే విధంగా ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు.

అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌లో 125, సిహెచ్‌సిలో 250, ప్రభుత్వ / ఏరియా ఆస్పత్రుల‌లో రోజుకు 325 మందికి చొప్పున వ్యాక్సినేషన్‌ జరిగే విధంగా ఏర్పాటు చేసుకోవాల‌న్నారు. ఇప్పటికే గుర్తించిన, చికిత్స అందిస్తున్న 9 ప్రైవేట్‌ ఆస్పత్రుల‌లో కోవిడ్ సేవ‌లు సరైన పద్ధతిలో అన్ని సదుపాయాల‌తో అందే విధంగా చూడాల‌న్నారు. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల‌లో మరింత ఎక్కువ సంఖ్యలో తిరిగి చికిత్సలు ప్రారంభించడానికి విస్తృత ఏర్పాట్లు చేసుకోవాల‌న్నారు.

పాజిటివ్‌ ఉన్న పేషెంట్లను ఇంటిలో ఉండలేని పరిస్థితుల్లో పాఠశాల‌లను ఇందుకై ఉపయోగించుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. బోధన్‌, ఆర్మూర్‌లో క్వారంటైన్‌ కేంద్రాలు ప్రారంభించాల‌ని ఆర్‌డిఓను ఆదేశించారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఇతర శాఖల‌ అధికారులు కూడా వారి శాఖాపరమైన విధులు నిర్వహిస్తూనే కోవీడు నివారణ చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగానికి అన్ని సహాయ సహకారాలు అందించాల‌ని ఆయన కోరారు.

ఆస్పత్రుల‌లో కోవిడ్‌కు సంబంధించిన అన్ని చికిత్సలు, పరీక్షలు నిర్వహిస్తూనే ఇతర చికిత్సల‌ను సేవల‌ను కూడా కొనసాగించాల‌ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వైరస్ వ‌ల్ల‌ జిల్లాలో ఎక్కడ కూడా మరణాలు సంభవించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల‌న్నారు. సెల్‌ కాన్ఫరెన్సులో పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ మాట్లాడుతూ ప్రజలు జాగ్రత్తలు తీసుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయవల‌సి ఉందని అంతేకాక ఎక్కువ సంఖ్యలో ఒకే చోట గుమికూడకుండా చర్యలు తీసుకుంటామని మతపరమైన కార్యక్రమాల‌పై దృష్టి పెట్టవల‌సి ఉన్నదని పండుగలు ఇతర కార్యక్రమాల‌పై ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉందని, కేంద్రాల‌ వద్ద కూడా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తామని వివరించారు.

ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు ప్రతి ఒక్కరు కూడా మొదటి రెండవ డోస్‌, వ్యాక్సినేషన్‌ తీసుకోవాల‌న్నారు. రెండు సమావేశాల‌ సందర్భంగా అదనపు కలెక్టర్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సంబంధిత శాఖల‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆసుపత్రి మూసివేత

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో నిష్కల్‌ న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ...

Comment on the article