Breaking News

ప్రత్యేక అవసరాలు గల పిల్ల‌ల‌కు పరికరాల‌ పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల‌ విద్యాశాఖ సంచాల‌కులు తెలంగాణ హైదరాబాద్‌ వారి ఆదేశానుసారం జిల్లాలోని 0 నుండి 18 సంవత్సరాల‌ వయసుగల‌ ప్రత్యేక అవసరాలుగల పిల్ల‌ల‌కు అంచనా క్యాంపు 2018లో నిర్వహించారు. దాని ద్వారా 195 ల‌బ్దిదారుల‌కు బుధవారం నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఉపకరణములు పంపిణీ చేశారు.

పంపిణీ చేయబడిన పరికరముల‌ వివరాలు :

వీల్‌చైర్లు 20, ట్రై సైకిల్స్‌ 1, ఎం.ఆర్‌.కిట్స్‌ 45, వినికిడి యంత్రాలు 100, బ్రెయిలీ కిట్స్‌ 2, మెడభాగం పట్టీలు 7, కాలిపర్స్‌ు 5, రోలెటర్‌లు 10, సిపి చేర్స్‌ 06, మొత్తం 196 పరికరాలు పంపిణీ చేశారు.

Check Also

ఆసుపత్రి మూసివేత

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో నిష్కల్‌ న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ...

Comment on the article