Breaking News

సంగీతకు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యం తెలుగు అధ్యయనశాఖ పరిశోధక విద్యార్థి ఆర్‌. సంగీతకు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని తెలుగు అధ్యయనశాఖ అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డా. కె. లావణ్య పర్యవేక్షణలో ‘‘అదిలాబాద్‌ జిల్లా గిరిజనుల‌ సంస్కృతి – మౌఖిక సాహిత్యం’’ అనే అంశంపై పిహెచ్‌. డి. పరిశోధన గావించి సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించి తెలంగాణ విశ్వవిద్యాల‌యానికి సమర్పించారు.

బుధవారం ఉదయం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేయబడిన పిహెచ్‌. డి. ఓపెన్‌ వైవా వోస్‌కు హైదరాబాద్‌ యూనివర్సిటీ నుంచి తెలుగు విభాగ ప్రొఫెసర్‌ ఆచార్య ఎం. గోనా నాయక్‌ హాజరై పరిశోధకురాలిని పరిశోధానాంశంపై పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. వైవా వోస్‌కు ఆర్ట్స్‌ పీఠాధిపతి ప్రొఫెసర్‌ పి. కనకయ్య చైర్మన్‌గా వ్యవహించారు.

డా. జి. బాల‌ శ్రీనివాస మూర్తి, డా. వి. త్రివేణి, సిహెచ్‌. ల‌క్ష్మణ చక్రవర్తి, అకడమిక్‌ కన్సల్టెంట్స్‌ డా. ఉప్పు కనకయ్య, డా. ఆఫ్రీన్‌ బేగం, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పరిశోధకులు ఆర్‌. సంగీత అదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూర్‌లో గల‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల‌లో తెలుగు విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆర్‌. సంగీత పిహెచ్‌. డి. సాధించడం పట్ల ఉపకుల‌పతి నీతూ కుమారి ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.

Check Also

సుజాత్‌ అలీకి డాక్టరేట్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగపు పరిశోధక విద్యార్థి, ...

Comment on the article