కామారెడ్డి, ఏప్రిల్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల తాగునీటికి అంతరాయం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ మిషన్ భగీరథ, గ్రామీణ మంచి నీటి సరఫరా ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్లో మున్సిపాలిటీలు, గ్రామాలలో మంచినీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు.
మిషన్ భగీరథ, ఆర్ డబ్ల్యూ ఎస్ ఇంజనీర్లు, మున్సిపల్ ఇంజనీర్లు పూర్తి సమన్వయంతో పనిచేయాలని, సరఫరాలో కానీ, పైప్ లైన్ల లీకేజీలో కానీ అంతరాయం ఏర్పడితే తక్షణమే స్పందించి పునరుద్దరణ చర్యలు చేపట్టాలని, గ్రామాలలో అంతర్గత పైప్ లైన్ పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ నెల 11 నుండి సింగూర్ ద్వారా వచ్చే మంచినీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని తెలిపారు.
సమీక్షలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు వెంకటేశ్ ధోత్రే, కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, మిషన్ భగీరథ ఇంట్రావర్క్స్ ఇఇ లక్ష్మినారాయణ, ఇఇ చౌదరిబాబు, ఇఇ నరేశ్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపల్ కమిషనర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ శంకుస్థాపనలు - April 16, 2021
- నిజామాబాద్ జిల్లాకు 1000 డోసుల రెమెడెసివిర్ - April 16, 2021
- మహిళల భద్రతకై క్యూ.ఆర్.కోడ్ - April 16, 2021