Breaking News

ఆ ఊర్లో మధ్యాహ్నం లాక్‌ డౌన్‌

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్ మండల‌ కేంద్రంలోని గ్రామ సచివాల‌యం కార్యాల‌యంలో శుక్రవారం సర్పంచ్‌ భోగ ధరణి ఆనంద్‌ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించి గ్రామంలోని దుకాణాలు కూరగాయల‌ మార్కెట్లు ఉదయం 6 గంటల‌ నుండి 10 గంటల‌ వరకు తెరిచి ఉండాల‌ని సాయంత్రం పూట నాలుగు గంటల‌ నుంచి ఆరున్నర గంటల‌ వరకు మాత్రమే దుకాణ సముదాయాల‌న్నీ తెరచి ఉండాల‌ని తీర్మానం చేసినట్లు తెలిపారు.

ఉదయం పది గంటల‌ నుండి సాయంత్రం నాలుగు గంటల‌ వరకు లాక్‌ డౌన్‌ విధించాల‌ని ఏకగ్రీవ తీర్మానం చేయడం వ‌ల్ల‌ మధ్యాహ్నం సమయంలో లాక్‌ డౌన్‌ విధించినట్లు తెలిపారు. మాస్కులు ధరించనివారికి వ్యాపారస్తులు ఎటువంటి సరుకులు అమ్మ రాదని ఒకవేళ అలా అమ్మినట్లయితే వ్యాపార సంస్థ వారికి రెండు వేల‌ రూపాయలు జరిమానా విధించబడుతుందని పేర్కొన్నారు.

కూరగాయల‌ మార్కెట్‌ను మండపం వద్దకు మార్చాల‌ని అలాగే ఆదివారం సంత రెండు వారాల‌ పాటు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ జరిగే ఆదివారం సంతకు రెండు వారాల‌ పాటు దూర ప్రాంతాల‌ నుంచి వచ్చే వ్యాపారస్తులు ఎవరు రాకూడదని విజ్ఞప్తి చేశారు. ప్రజల‌ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, నిబంధనలు ఏప్రిల్‌ 30వ తారీకు వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకోబడతాయని సర్పంచ్‌ బోగ ధరణి ఆనంద్‌ తెలిపారు.

Check Also

22న సర్వసభ్య సమావేశం

మోర్తాడ్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ ప్రజా పరిషత్‌ కార్యాల‌యంలో ఈ నెల‌ ...

Comment on the article