Breaking News

అక్కడ ఒంటిపూట లాక్‌ డౌన్‌

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో మంగళవారం నుండి ఒంటిపూట లాక్‌ డౌన్‌ విధించారు. ఉదయం 6 గంటల‌ నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వ్యాపార సంస్థలు తెరిచి ఉంచాల‌ని అలాగే కూరగాయల‌ మార్కెట్‌ ఒంటి గంట వరకు ఉంచాల‌ని ఒంటిగంట నుండి రాత్రి 8 గంటల‌ వరకు గ్రామస్తులు స్వచ్చందంగా లాక్‌ డౌన్‌ విధించారు.

గ్రామ ప్రజల‌ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని గ్రామంలోని ప్రజలు ఎవరూ కూడా కరోనా బారిన పడకుండా తమ తమ ప్రాణాల‌ను కాపాడుకోవాల‌ని గ్రామస్తులు తీర్మానించుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గ్రామ ప్రజలు వివిధ పనుల‌పై ఆయా దుకాణాల‌కు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాల‌ని, కూరగాయల‌ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు కూడా మాస్కులు ధరించాల‌ని, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాల‌ని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు గ్రామ సర్పంచ్‌ భోగ ధరణి ఆనంద్‌ తెలిపారు.

తీర్మానాన్ని ఎవరైనా ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకోబడుతాయని వారు తెలిపారు. ప్రజల‌కు ఏ కొంచెం అనుమానం వచ్చిన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కరోనా టెస్టు చేయించుకోవాల‌ని ఆమె వివరించారు. దీర్ఘకాలంగా జ్వరంతో బాధపడేవారు తప్పనిసరిగా కరోనా టెస్ట్‌ చేయించుకోవాల‌ని ఆమె అన్నారు. కరోనా సోకకుండా గ్రామ ప్రజలంతా కట్టడితో ఉండి ప్రజల‌ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌ని ఆమె కోరారు.

Check Also

22న సర్వసభ్య సమావేశం

మోర్తాడ్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ ప్రజా పరిషత్‌ కార్యాల‌యంలో ఈ నెల‌ ...

Comment on the article