Breaking News

Daily Archives: April 25, 2021

టేక్రియాల్‌లో సెల్ఫ్‌ లాక్‌డౌన్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తున్న సమయంలో ప్రజలు అనేకమంది కరోనా బారిన పడి వైద్య చికిత్సలు పొందుతున్న విషయం తెలిసిందే. కాగా కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణ పరిధిలోని 13 వ వార్డులో ఆదివారం నంగునూరు నాగరాజు (48) అనే వ్యక్తి కరోనా బారిన పడి మృతి చెందాడు. అంతేకాకుండా మరికొంతమంది కోవిడ్ ల‌క్షణాలు ఉన్నవారు ఇప్పటికే వైద్య సహాయం పొందుతున్నారు. కరోనా కోసం టేక్రియల్‌ గ్రామ ప్రజలు నంగునూరు నాగరాజు చిత్రపటానికి ...

Read More »

సోమవారం ప్రజావాణి రద్దు

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు అయిన దృష్ట్యా ప్రజలు తమ యొక్క ఫిర్యాదుల‌ను ప్రతి సోమవారం ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ద్వారా ఉదయం 10.30 గంటల‌ నుండి మధ్యాహ్నం 12 గంటల‌ వరకు 8468220044 ఫోన్‌ నెంబర్‌ ద్వారా తమ ఫిర్యాదుల‌ను అందించాల్సిందిగా కలెక్టరేట్‌ పరిపాల‌న అధికారి పి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని గిర్నీ తండాలో సర్పంచ్‌ చందర్‌, నాయకులు రెడ్యానాయక్‌, గ్రామస్తులు అందరూ కసి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్‌ ప్రాజెక్టు లోకి నీరు చేరడంతో హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేశామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తోనే గ్రామాల‌ అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు దేవల‌, రాము, అబ్బార్‌ సింగ్‌, ...

Read More »

కరోన నుంచి కోలుకోవాల‌ని పూజలు

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌ పల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆల‌యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌లు కరోనా వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాల‌ని తెలంగాణ రాష్ట్ర నాయకులు పెద్ద పట్లోళ్ల సిద్ధార్థ రెడ్డి, గ్రామ ప్రజల‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇస్తానని ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో ...

Read More »

కరోనా నివారణకు ప్రజలు సహకరించాలి

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో కరోనా నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యల‌కు ప్రజలు అందరూ సహకరించాల‌ని మోర్తాడు ఎస్‌ఐ సురేష్‌ కుమార్‌ అన్నారు ఆయన ఆదివారం మాట్లాడుతూ మోర్తాడ్‌ మండలంలో కూడా అన్ని గ్రామాల‌లో ప్రజలు కరోనా నివారణకు చేపట్టిన చర్యల‌కు అనుకూలంగా మసులుకుంటూ అధికారుల‌కు సహాయ సహకారాలు అందివ్వాల‌న్నారు. దేశంలో కోవిద్‌ 19 సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని అందువ‌ల్ల‌నే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని ఎస్సై సురేష్‌ కుమార్‌ వివరించారు. రాష్ట్రంలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ...

Read More »

గల్ఫ్‌లో ఎగవేసిన జీతాలు ఇలా పొందవచ్చు !

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా సందర్బంగా గల్ఫ్‌ తదితర దేశాల‌ నుండి వాపస్‌ వచ్చిన వల‌స కార్మికుల‌కు వారి యాజమాన్యాల‌ నుండి రావల‌సిన జీతం బకాయిలు, బోనస్‌, పిఎఫ్‌, గ్రాట్యుటీ లాంటి ‘ఎండ్‌ ఆఫ్‌ సర్వీస్‌ బెనిఫిట్స్‌’ (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) ఇప్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాల‌ని ప్రవాసి మిత్ర లేబర్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్‌ పరికిపండ్ల ఒక ప్రకటనలో కోరారు. ‘జస్టిస్‌ ఫర్‌ వేజ్‌ తెఫ్ట్‌’ (జీతం దొంగతనం గురించి న్యాయం చేయాలి) ...

Read More »

కరోనాతో కానిస్టేబుల్‌ మృతి

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండల‌ కేంద్రంలోని పోలీస్‌ స్టేషనులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అనంతయ్య కరోనా బారిన పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతయ్య నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలంలోని ల‌క్కొర గ్రామానికి చెందిన వాడని, గతంలో మోర్తాడ్‌ పోలీసు స్టేషన్‌లో చాలా రోజులుగా విధులు నిర్వహించి ఇక్కడి ప్రజల‌ మన్ననలు పొందారన్నారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నట్టు తెలిసింది. అనంతయ్య మృతిచెందడంతో కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయామని కుటుంబ ...

Read More »