Breaking News

నిర్ణయించిన చార్జీలు మాత్రమే వసూలు చేయాలి

నిజామాబాద్‌, మే 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని ప్రైవేటు ల్యాబ్‌ యాజమానులు కరోనా టెస్టుల‌ పేరుతో ఇష్టానుసారంగా డబ్బు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నందున జిల్లా కలెక్టర్‌ జిల్లా వ్యాప్తంగా ఆరు టాస్క్‌ ఫోర్స్‌ టీంల‌ను ఏర్పాటు చేసి మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. 23 కేంద్రాల‌లో తనిఖీలు చేసి కొన్ని కేంద్రాల‌లో సరియైన సౌకర్యాలు కల్పించట్లేదని విచారణలో తేలింది.

వీటి విషయమై విచారణ అనంతరం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. కావున ల్యాబ్‌ నిర్వాహకులు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలు మాత్రమె వసూలు చేయాల‌న్నారు. ఇందు కోసం ప్రతి ల్యాబ్‌లో ధరల‌ పట్టికను తప్పనిసరిగా పొందుపరచాల‌ని హెచ్చరించారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article