Breaking News

గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, మే 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణ కేంద్రానికి చెందిన సల్మా బేగం అనే గర్భిణీ రక్త హీనతతో బాధపడుతుండటంతో వారికి కావసిన రక్తం దొరకక పోవడంతో బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా వెంటనే వారికి కావల‌సిన ఏబి పాజిటివ్‌ రక్తాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఎవరికైనా ఏ గ్రూపు రక్తం అయినా 9492874006 నంబర్‌కి సంప్రదించినట్లయితే వారికి కావాల్సిన రక్తాన్ని అందజేసి ప్రాణాల‌ను కాపాడుతామని అన్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ రక్తదానం చేయడానికి రక్తదాతలు ముందుకు రావాల‌న్నారు. కార్యక్రమంలో బ్లడ్‌ బ్యాంక్‌ టెక్నీషియన్‌ చందన్‌, ఉపాధ్యాయులు జమీల్‌ అహ్మద్‌ తదితరులున్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article