Breaking News

వ్యాక్సినేషన్‌, కరోనా పరీక్షలు డోర్‌ టు డోర్‌ సర్వే నిర్వహించాలి

నిజామాబాద్‌, మే 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నాగారం, అర్సపల్లి పి.హెచ్‌.సిల‌ ను జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లాక్‌ డౌన్‌లో కూడా వోపి సేవ‌లు వ్యాక్సినేషన్‌ కరోనా పరీక్షలు హౌస్‌ హోల్డ్‌ సర్వే నిర్వహించాల‌ని తెలిపారు. పిహెచ్‌సిలో ఓపి రిజిస్టర్‌ పరిశీలించారు.

కోవిడ్‌ వోపి. జనరల్‌ వోపి, పిహెచ్‌సి పరిశీలించారు. రెండవ డోస్‌ తీసుకోవడానికి వస్తున్నారా కరోనా ర్యాపిడ్‌ పరీక్షలు ఈరోజు ఎన్ని జరిగాయని, కోవిద్‌ వ్యాక్సినేషన్‌ కు ఎంత మంది వచ్చార‌ని అక్కడి వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. ర్యాపిడ్‌ పరీక్షలు ఐటిఐ కళాశాల‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాగారం చౌరస్తా లాక్‌ డౌన్‌ డ్యూటీ లో ఉన్న సిఐ తో కలెక్టర్‌ ధాన్యం లోడ్స్‌ అత్యవసర సరుకులు తెచ్చే లారీల‌ను ఆపరాదని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, డిఎం హెచ్‌ వో బాల‌ నరేందర్‌, సామ్రాట్‌, పద్మ తదితరులు ఉన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article