Breaking News

సేవా హీ సంఘటన్‌

నిజామాబాద్‌, మే 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌లో ప్రముఖ వ్యాపారవేత్త, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌ పాల్‌ సూర్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో నిజామాబాద్‌ నగరంలోని 5వ డివిజన్‌ (బోర్గాం) లో నిరుపేదల‌కు ఆహార వితరణ మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్‌ సందగిరి సౌజన్య, బీజేవైయం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌ రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆమందు విజయ్‌, భాస్కర్‌ రెడ్డి, ఆశీష్‌, ఉల్లెంగ నవీన్‌, నితిన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అలాగే నగరంలోని 40వ డివిజన్లో నిరుపేదల‌కు, మునిసిపల్‌ సిబ్బందికి ఆహార వితరణ మరియు పండ్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాజపా నాయకులు అనిల్‌ కుమార్‌, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article