Breaking News

లాక్‌ డౌన్‌ కఠినంగా అమలు చేయండి

నిజామాబాద్‌, మే 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల‌ కోట్ల నష్టాన్ని భరించడానికి సిద్ధమై ప్రజల‌ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని విధించిన లాక్‌ డౌన్‌ పకడ్బందీగా అమల‌య్యేలా పోలీస్‌ శాఖ అధికారులు కఠినంగా వ్యవహరించాల‌ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆదేశించారు. శుక్రవారం ఆయన వరంగల్‌ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వితో కలిసి రాష్ట్ర డిజిపి మహేందర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల‌తో కోవిడ్‌ 19 పై వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లాక్‌ డౌన్‌ తర్వాత కరోనా వ్యాప్తి తగ్గుతూ వస్తున్నదని మందులు, ఇంజక్షన్లు ఆస్పత్రుల‌లో బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే ఉదయం 10 గంటల‌ తర్వాత కూడా చాలా మంది ప్రజలు రోడ్ల పైన కనిపిస్తున్నారని ఇది ఎంత మాత్రం కరోనా కట్టడికి సరైంది కాదని ఆయన అన్నారు. అత్యవసరానికి పాస్లు ఉన్న వారు తప్పనిసరి విధులు నిర్వహించే వారు విద్యుత్తు వైద్య ఆరోగ్య శాఖ పోలీసు ఇతర ముఖ్యమైన శాఖల‌ అధికారులు సిబ్బంది మినహా ఇతరులు ఎవరు లాక్‌ డౌన్‌ సమయంలో రోడ్లపైన కనిపించకుండా కఠినంగా వ్యవహరించాల‌ని అప్పుడే వైరస్‌ను నిలువరించడానికి వీల‌వుతుందని పోలీసు అధికారుల‌కు సూచించారు.

ఆస్పత్రుల‌లో సేవ‌లు ఇతర సదుపాయాలు బాగున్నప్పటికీ పారిశుద్ధ్య కార్యక్రమాలు ఏమాత్రం సంత ృప్తికరంగా లేవని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని ఈ దిశగా అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ ఆస్పత్రుల‌లో చెత్తను తొల‌గించడం, పరిశుభ్రంగా ఉంచడం చేయించాల‌ని ఆదేశించారు. రోహిణి కార్తె త్వరలో వస్తుందని ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాల‌న్నారు.

కలెక్టర్‌ వివరణ :
జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లా సరిహద్దుల్లో మహారాష్ట్ర ఉన్నందున అక్కడి నుండి ప్రజలు రావడం వ‌ల్ల‌ గత నెల‌లో వందకు 25 పాజిటివ్‌ కేసులు వచ్చాయని ప్రస్తుతం 10 శాతం వస్తున్నాయని ఫలితాల వ‌ల్ల‌ మరింత వ్యాప్తి తగ్గుతుందని తెలిపారు. మొదటి విడత ఇంటింటి సర్వే వ‌ల్ల 4 ల‌క్షల‌ 8 వేల‌ గ ృహాల‌లో సర్వే నిర్వహించగా 7724 మందికి వైరస్ ల‌క్షణాలు ఉన్నట్లు గుర్తించామని వారికి వైద్య కిట్లు అందించి పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు.

రెండో విడతలో 3.27 ల‌క్షల‌ కుటుంబాల‌కు 80 శాతం సర్వే పూర్తయిందని పేర్కొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి పల్స్‌ ఆక్సి మీటర్‌ అందించామని తద్వారా రోగి ల‌క్షణాల‌ను పర్యవేక్షణ చేస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో ఆక్సిజన్‌, ఇంజక్షన్లు, మందులు, బెడ్స్‌ అవసరం మేరకు అందుబాటులో ఉన్నాయని ఎటువంటి సమస్య లేదన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 5.80 ల‌క్షల‌ మెట్రిక్‌ టన్నుల‌ ధాన్యం కొనుగోలు పూర్తయిందని మరో 70 వేల‌ మెట్రిక్‌ టన్నులు వచ్చే అవకాశం ఉందని దానిని కూడా సేకరిస్తే పూర్తి అవుతుందని వివరించారు.

వీడియో కాన్ఫరెన్సులో కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్తికేయ, అదనపు సీపీ ఉష విశ్వనాథ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, ల‌త, వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాల‌ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article