Breaking News

లాక్‌ డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు కలెక్టర్‌, సిపి

నిజామాబాద్‌, మే 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కట్టడి నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన లాక్‌ డౌన్‌ నిబంధనలు ఎవరు అతిక్రమించిన కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్తికేయ ఆదేశించారు. లాక్‌ డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయాల‌ని అప్పుడే వైరస్‌ వ్యాప్తి తగ్గుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధికారుల‌ను ఆదేశించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌, కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌, నగర కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఆర్‌డిఓ రవి తదితరులు శనివారం నగరంలోని ముఖ్యమైన కూడళ్ళలో పర్యటించి రద్దీని పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు గాంధీ చౌక్‌, గంజ్‌, వీక్లీ మార్కెట్‌, ఖిల్లా రోడ్‌, దేవి రోడ్డు, వర్ని రోడ్డు తదితర ముఖ్యమైన ప్రాంతాల‌లో పర్యటించి రద్దీని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యల‌పై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ లాక్‌ డౌన్‌ విధిస్తూ ఉదయం 6 గంటల‌ నుండి 10 గంటల‌ వరకు ప్రజలు నిత్యావసర ఇతర వస్తువులు కొనుక్కోవడానికి వేరే పనుల‌కు వెళ్లడానికి సడలింపు ఇవ్వడం జరిగిందని సడలింపు సమయములో ప్రజలు దుకాణాల‌లో కూరగాయల‌ వద్ద పెద్ద సంఖ్యలో జమ కావడం వ‌ల్ల‌ వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అందువ‌ల్ల‌ మరిన్ని మార్కెట్లను తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

టిఫిన్‌ సెంటర్లు హోటళ్లలో ప్రజలు మాస్కులు తీసి ఫల‌హారాలు చేయడంవ‌ల్ల‌ చిన్న స్థలాల్లో సామాజిక దూరం పాటించడం వీలు కాదు కావున అక్కడ తినడం నిషేధించడం జరిగిందని కేవలం పార్సల్‌ మాత్రమే అనుమతించామని ఆదేశాలు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాల‌ని లేదంటే ఆయా టిఫిన్‌ సెంటర్లను క్లోజ్‌ చేస్తామని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. సడలింపు సమయంలో కూడా ప్రజలు తప్పనిసరి అయితేనే బయటకు రావాల‌ని వచ్చినా కూడా డబుల్‌ మాస్క్‌ ధరించాల‌ని సామాజిక దూరం పాటించాల‌ని, ఇంటికి వెళ్లగానే ముందుగా చేతులు శుభ్రం చేసుకోవాల‌ని సూచించారు.

ఈ విషయాల్లో ఏమాత్రం అజాగ్రత్త చేసినా తమతో పాటు కుటుంబ సభ్యుల‌కు కూడా వైరస్‌ను తీసుకు వెళ్లిన వారు అవుతారని సెకండ్‌ వేవ్‌ వైరస్‌ చాలా వేగంగా ప్రమాదకరంగా వ్యాపిస్తుందని ప్రజలు గమనించాల‌ని లేదంటే ప్రాణాల‌కే ఇబ్బంది కలుగుతుందని హెచ్చరించారు. లాక్‌ డౌన్‌తో పాటు ప్రజల‌ సహకారం వ‌ల్ల‌నే వైరస్‌ వ్యాప్తి 25 నుండి 10 శాతానికి తగ్గిందని ప్రజలు అన్ని విధాల‌ సహకరిస్తే జీరో శాతానికి తగ్గించడానికి వీల‌వుతుందని ఇందుకు ప్రజలు, వారి కుటుంబ సభ్యులు జిల్లా యంత్రాంగానికి సహకరించాల‌ని తద్వారా కుటుంబాన్ని వైరస్‌ బారి నుండి కాపాడుకో గలుగుతారని పేర్కొన్నారు.

కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ మాట్లాడుతూ, ఉదయం 10 గంటల‌ తర్వాత పాస్‌లు ఉన్నవారు తప్ప ఎవ్వరు కూడా రోడ్లపైన తిరగవద్దని అతిక్రమిస్తే వాహనాలు సీజ్‌ చేయడంతోపాటు కేసులు నమోదు చేస్తామని, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాల‌ని తెలిపారు. 7 గంటల‌ లోపుగా బయటకు వెళ్లి ఇంటికి చేరుకోవడానికి ప్రయత్నించాల‌ని ఆ సమయంలో రద్దీ తక్కువగా ఉంటుందని సూచించారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article