Breaking News

బోధన్‌లో లాక్‌ డౌన్‌ కఠినతరం

బోధన్‌, మే 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజమాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో లాక్‌ డౌన్‌ను కఠినతరం చేసిన పోలీసులు బైక్ ల‌పై తిరుగుతూ ప్రజలెవరు బయటకి రావద్దని హెచ్చరించారు. రోడ్లపై తిరుగుతున్న వాహనదారుల‌ను చెదర గొట్టారు. బోధన్‌ ఏసీపీ రామారావు నేత ృత్వంలో పకడ్బందీ చర్యల‌ను పోలీసులు చేపడుతున్నారు. బోధన్‌ పట్టణం ఆచన్‌ పల్లి, శక్కర్‌ నగర్‌, పోస్ట్‌ ఆఫీసు, రాకాసిపెట్‌ గుండా పోలీసులు బైక్‌ ర్యాలీ చేపట్టారు.

కొన్ని ప్రాంతాల్లో వ్యాపార షాపుల‌ను మూసివేయించారు. లాక్‌ డౌన్‌ సమయంలో అనుమతిలేని వాహనాల‌ను సీజ్‌ చేశారు. అంబెడ్కర్‌ చౌరస్తా ప్రాంతంలో రోడ్డుపై ఎండలో అలమటిస్తూ బాధపడుతున్న శరణార్థుడికి స్వయంగా బోధన్‌ ఏసీపీ రామారావు లేపి నీళ్లతో సెదతీర్చారు. నీడలో పడుకోపెట్టారు. ఏసీపీ మాట్లాడుతు ప్రజలు, వ్యాపారులు సీఎం ఇచ్చిన నాలుగుగంటల‌ సమయంలో అన్ని పనులు పూర్తిచేసుకోవాల‌ని సూచించారు.

అగ్రిక‌ల్చ‌ర్‌ పనుల‌కి వెళ్ళేవారు తప్పనిసరి అయితేతప్ప బయట తిరగరాదని విజ్ఞప్తి చేసారు. పోలీసులు బైక్‌ ర్యాలీలో సిఐలు రామన్‌, అశోక్‌ రెడ్డి, ఎస్‌ఐలు మోహన్‌ రావ్‌, గోవింద్‌, సందీప్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి నెట్ట బడుతుంది

బోధన్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ పాల‌నలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఐఎఫ్‌టీయూ జిల్లా ...

Comment on the article