Breaking News

కరోనా సోకిన వారికి చేయూత

బీర్కూర్‌, మే 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండల‌ కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన భార్య భర్తలు ఇద్దరికి కరోనా సోకడంతో వారి కుటుంభ సభ్యులు ఈ విషయాన్ని టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్దుల్‌ అహ్మద్‌కి తెలిపారు. స్థానిక కాంగ్రెస్‌ నాయకుల‌తో కలిసి వెళ్ళి కరోనా సోకిన కుటుంబానికి వారం రోజులు సరిపడ నిత్యావసర సరుకులు, మెడికల్‌ ఎక్విప్‌ మెంట్స్‌, పండ్లు, బ్రేడ్‌ ప్యాకెట్స్‌, గుడ్లు, బియ్యం అందజేశారు.

ఈ సందర్భంగా అబ్దుల్‌ అహ్మద్‌ మాట్లాడుతూ కరోనా సోకిన వారెవ్వరికైనా వారి కుటుంభ సభ్యులు తెలియచేస్తే తన వంతు సహాయం చేయడానికి నేను ముందుంటానని అన్నారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు ప్రజా క్షేమం కోరే పార్టీ అని కొనియాడారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విల‌య తాండవం చేస్తుందని జాతీయ విపత్తు కింద ప్రకటించి రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్‌ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి తెలుపు రేషన్‌ కార్డు కలిగిన ప్రతి బీద వారిని ఆదుకోవాల‌ని, పక్క రాష్ట్రంలో కరొనాను ఆరోగ్యశ్రీలో చేర్చారని, మొన్న కొత్తగా వఛ్చిన బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చారని, మరి మన ధనిక రాష్ట్రమైన తెలంగాణాలో ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదని అన్నారు.

ఆయన వెంట మండల‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పోగు నారాయణ, మాజీ సర్పంచ్‌ సానెపు పెద్ద గంగారాం, మాజీ మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు రాచప్ప పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎం రిలీప్‌ ఫండ్‌ అందజేత

బీర్కూర్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాదు మండల్‌ సంగం గ్రామానికి చెందిన జర్పుల‌ సుభాష్‌ ...

Comment on the article