Breaking News

కళ్యాణల‌క్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, మే 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల‌ సురేందర్‌ కళ్యాణల‌ క్ష్మి, షాది ముభారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ల‌బ్ధిదారులందరినీ ఒకే దగ్గరకు చేర్చకుండా మండలంలోని గ్రామాల్లో పంపిణీ కేంద్రాల‌ను ఏర్పాటు చేసి కరోనా నిబంధనల‌ను పాటిస్తూ చెక్కులు పంపిణీ చేశారు.

మండలంలో మొత్తం 1 కోటి 16 ల‌క్షల‌ 18 వేల‌ 676 రూపాయల‌ 161 చెక్కులు, చెక్కుల‌తో పాటు ఆడపడుచుల‌కు పెళ్లి కానుకగా పట్టు చీరను ఎమ్మెల్యే ల‌బ్ధిదారుల‌కు అందజేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ కుడుముల‌ సత్యనారాయణ, జడ్పీటీసీ ఉష గౌడ్‌, డీసీసీబీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, మండల‌ తెరాస పార్టీ అధ్యక్షుడు జలంధర్‌ రెడ్డి, మునిసిపల్‌ కౌన్సిల‌ర్స్‌, ఆయా గ్రామాల‌ ఎంపిటిసిలు, సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

వెనకబడిన ప్రాంతాల‌ను గుర్తించి అభివృద్ధి చేయాలి

ఎల్లారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అందరి సహకారంతో ఎల్లారెడ్డి పట్టణాన్ని ఆరోగ్య పట్టణంగా తీర్చిదిద్దాల‌ని ...

Comment on the article