Breaking News

నేటికి ఆరునెల‌లు పూర్తయింది

ఆర్మూర్‌, మే 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐకెఎస్‌సిసి దేశవ్యాప్తంగా న‌ల్ల‌ జండాలు ఎగరేసి నిరసన తెల‌పాల‌ని ఇచ్చిన పిలుపు మేరకు సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ పట్టణ కేంద్రంలో న్యూడెమోక్రసీ కార్యాల‌యం కుమార్‌ నారాయణ భవన్‌ వద్ద న‌ల్ల‌ జండాలు ఎగరేసి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ కార్యదర్శి ముత్తెన్న మాట్లాడుతు రైతు వ్యతిరేక మూడు చట్టాలు రద్దు చేయాల‌ని రైతాంగం ఆందోళన చేపట్టి నేటికి ఆరునెల‌లు పూర్తయిందని అయినా మోదీ ప్రభుత్వం తన ఒంటెద్దు పోకడల‌తో వ్యవహరిస్తు పెట్టుబడిదారుల‌కు అనుకూలంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రైతు పండించిన పంటకు ఎంఎస్‌పి మినిమం సపోర్టు ప్రైస్‌ ప్రకటించకుండా స్వేచ్చ మార్కేట్‌ అని చేపుతునే మల్టీ నేషనల్‌ కంపేనీల‌కు అప్పజేప్పే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు.

రైతుల‌ను అదుకోవాల‌ని 18 రాష్ట్రాల‌ రైతులు పోరాటం చేస్తున్నా పాల‌కులు స్పందించకుండా ఫాసిస్టు ధోరణలు అవలంబిస్తున్నారని అన్నారు. తన విధానాల‌ను మార్చుకుని రైతు వ్యతిరేక చట్టాల‌ను రద్దు చేయకపోతే నిన్ను కుర్చీలోంచి దించేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వారు హెచ్చరించారు. ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి దాసు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాల‌ను తెచ్చి వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే విధానాలు అవలంబిస్తుందని అట్లాగే కార్మిక చట్టాల‌ను సవరించి నాలుగు కోడ్‌లుగా మార్చి కార్మిక హక్కుల‌ను కాల‌రాస్తున్నదని, యూనియన్‌లు లేకుండా చేసే కుట్ర చేస్తున్నారని, ఉపాధి అవకాశాలు లేకుండా ఉద్యోగ భద్రత లేని పరిస్థితి దాపురించిందన్నారు.

వెంటనే ప్రజా వ్యతిరేక నిర్ణయాల‌ను వెనక్కి తీసుకోవాల‌ని, రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాల‌ని వారు డిమాండ్‌ చేశారు. అనంతరం తెలంగాణ ప్రగతిశీల‌ బీడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు శివాజీ, పివైఎల్‌ రాష్ట్ర నాయకులు సుమన్‌, సబ్‌ డివిజన్‌ నాయకులు ఠాకూర్‌, ఏఐకెఎంఎస్‌ ఏరియా కార్యదర్శి రాజన్న, అరుణోదయ జిల్లా కార్యదర్శి సూరిబాబు మాట్లాడారు. కార్యక్రమంలో పిడిఎస్‌యు ఉపాధ్యక్షుడు దుర్గాప్రసాద్‌, వివిధ ప్రజా సంఘాల‌ నాయకులు నజీర్‌, రంజిత్‌, పోగు నగేష్‌ గౌడ్‌, మల్లేష్‌, వెంకటేష్‌, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Check Also

అందరు తప్పక వ్యాక్సిన్‌ తీసుకోవాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం భారతీయ జనతా పార్టీ మాక్లూర్‌ మండల‌ శాఖ ...

Comment on the article