Breaking News

28, 29 తేదీల్లో సూపర్ స్పైడర్స్ కు వ్యాక్సినేషన్

నిజామాబాద్‌, మే 26

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రేషన్ షాప్ డీలర్లు, ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్లు, పెట్రోల్ బంకులు, ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్స్, వాటిలో పని చేసేవారు, జర్నలిస్టులకు ఈ నెల 28, 29 తేదీలలో వ్యాక్సినేషన్ కొరకు జాబితాలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

బుధవారం ఆయన సంబంధిత అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం రేషన్ షాపు డీలర్లు వాటిల్లో పనిచేసే సహాయకులు ఎల్‌పిజీ డిస్ట్రిబ్యూటర్ పనివారు అదేవిధంగా పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బంది జర్నలిస్టులు మీడియా ప్రతినిధులు ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ సీడ్స్ డీలర్ వాటిలో పనిచేసే వర్కర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వడానికి అవసరమైన ఏర్పాటు చేయాలని లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు.

పౌరసరఫరాల అధికారులు, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా పౌరసంబంధాల అధికారి వారి పరిధిలోని అర్హుల జాబితాను మండలాల వారీగా సిద్ధం చేసి బుధవారం రోజు సమర్పించాలని ఆదేశించారు. లబ్ధిదారుల సంఖ్యను మండలాల వారీగా పరిశీలించి ఎక్కువ సంఖ్యలో ఉంటే మండలంలో రెండు కేంద్రాలు గాని తక్కువగా ఉంటే రెండు మూడు మండలాలకు ఒక కేంద్రం గాని వ్యాక్సినేషన్ కొరకు ఏర్పాటు చేసి ఈనెల 28, 29 తేదీలలో వీరందరికీ వ్యాక్సినేషన్ చేయనున్నట్లు తెలిపారు.

నిర్దేశించిన గూగుల్ ప్రొఫార్మా లో లబ్ధిదారులు వారి యొక్క వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలని ఆయన కోరారు. సంబంధిత వ్యాక్సినేషన్ కేంద్రాలలో ఆయా శాఖలకు సంబంధించిన సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రశాంతంగా, పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ జరిగే విధంగా చూడాలన్నారు. కచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అందే విధంగా చూడటంతోపాటు అర్హత లేనివారి వివరాలు ఇవ్వ వద్దన్నారు.

జర్నలిస్టులు/ మీడియా ప్రతినిధులు వారికి సమాచార శాఖ ద్వారా జారీ చేసిన 2019 – 21 సంవత్సరాలకు వర్తించే అక్రిడేషన్ కార్డును వ్యాక్సినేషన్ సమయంలో సమర్పించాలని అదేవిధంగా ఆధార్ కార్డు ప్రతిని కూడా సమర్పించాలని ఆయన సూచించారు. అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు

సెల్ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు వెంకటేశ్వరరావు, గోవిందు, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మొబైల్‌ కూరగాయల‌ వాహనాలు ప్రారంభం

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనసాగుతున్న లాక్‌ డౌన్‌ ను ద ృష్టిలో పెట్టుకొని ...

Comment on the article