Breaking News

సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ కొరకు 18 కేంద్రాలు

నిజామాబాద్‌, మే 27

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఈనెల 28, 29 తేదీలలో సూపర్ స్ప్రెడర్లకు అందించే వ్యాక్సింగ్ కొరకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

గురువారం సివిల్ సప్లై వ్యవసాయ సమాచార పౌర సంబంధాలు వైద్య ఆరోగ్య శాఖ, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్, ఆర్డివోలు తదితర అధికారులతో ప్రత్యేక వ్యాక్సినేషన్ పలు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొరకు 28, 29 తేదీలలో 50 శాతం చొప్పున వ్యాక్సిన్ వేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే తయారు చేసుకున్న జాబితాల ప్రకారము లబ్ధిదారులకు ఫోన్ చేసి వారు ఏ కేంద్రానికి ఎప్పుడు రావాలో సమాచారం అందించాలని ఆదేశించారు.

వీరిలో మొదటి డోసు వేసుకోని వారికి మాత్రమే మొదటి డోసు వ్యాక్సిన్ వేయాలని, ఇప్పటికే ఒక డోసు వ్యాక్సిన్ వేసుకున్న వారికి మరొకసారి పాత కేంద్రంలోనే మళ్లీ వేస్తారని వారికి ఇప్పుడు కాదని తెలపాలన్నారు.

అంతేకాక ప్రస్తుతం కోవీషీల్డ్ మాత్రమే వేస్తున్నామన్నారు. ఇందుకుగాను మోపాల్, నిజామాబాద్ మండలాలు, మున్సిపాలిటీ వారికి నిజామాబాద్ లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం, రాజారాం స్టేడియం, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో, బాల్కొండ సిహెచ్సిలో బాల్కొండ, మెండోరా, ముప్కాల్ మండలాల వారికి, భీమ్‌గ‌ల్ మండలం వారికి భీంగల్ ఆరోగ్య కేంద్రంలోనూ, బోధన్, ఎడపల్లి మండలాల్లోని వారికి బోధన్ లోనూ, డిచ్‌ప‌ల్లి, ఇందల్వాయి వారికి డిచ్‌ప‌ల్లి సిహెచ్సిలోను, సిరికొండ, ధర్పల్లి వారికి సిరికొండ ఆరోగ్య కేంద్రంలోనూ, జక్రాన్‌ప‌ల్లిలో అక్కడి ఆరోగ్య కేంద్రంలోనూ, కమ్మర్‌ప‌ల్లి, మోర్తాడ్ మండలాల వారికి కమ్మర్‌ప‌ల్లి పీహెచ్‌సిలోను, కోటగిరి , రుద్రూర్ వారికి కోటగిరి ఆరోగ్య కేంద్రంలోనూ, నవీపేట్, రెంజల్ మండలాలకు చెందినవారికి నవీపేట సిహెచ్సిలోను, వేల్పూర్ లో వేల్పూర్ వారికి, వర్ని , చందూర్, మోస్రా మండలాల వారికి వర్ని సిహెచ్సి లోను, నందిపేట మండలం వారికి నందిపేట ఆరోగ్యం కేంద్రంలోనూ, ఆర్మూర్, మాక్లూర్ మండలాల వారికి ఆర్మూర్ సిహెచ్సిలోను వ్యాక్సిన్ వేస్తారని కలెక్టర్ వివరించారు.

వ్యాక్సినేషన్ కొరకు వచ్చేవారు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు ధ్రువ పత్రాల కాపీ సమర్పించాలని తెలిపారు. వ్యాక్సిన్ వేసే కేంద్రాలలో టెంట్లు, త్రాగునీరు, వెయిటింగ్ రూము, వ్యాక్సినేషన్ రూము, అవసరమైన మందులు, అత్యవసర మందులు తదితర ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

చౌక ధరల దుకాణాల డీలర్లు వారి సహాయకులు, ఎల్పీజీ డీలర్లు పని చేసేవారు , పెట్రోల్ బంకుల మేనేజర్లు సిబ్బంది వీరందరికీ, అదేవిధంగా జర్నలిస్టులకు సంబంధిత తహసీల్దార్లు జాబితాల ప్రకారము ఫోన్లు చేసి వివరాలు నమోదు చేసుకొని వ్యాక్సిన్ కొరకు వచ్చే వారి వివరాలతో సరిచూసుకొని కేంద్రంలో ఎంతమందికి వ్యాక్సిన్ వేయాలో అందుకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలని ప్రతి కేంద్రంలో 250 మంది వరకు వ్యాక్సిన్ వేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు వారి పరిధిలోని ఫెర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్, సీడ్స్ దుకాణాల యజమానులు, డీలర్లు ఉద్యోగుల వివరాలను మండలాల వారీగా సిద్ధం చేసుకొని ఏర్పాటు చేసే వ్యాక్సిన్ కేంద్రాలకు అనుగుణంగా వ్యాక్సిన్ వేయించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

ఎవరి పరిధిలోని లబ్ధిదారులను వారే గుర్తించాలని జర్నలిస్టులకు మాత్రం వారి 2019 – 21 సంవత్సరానికి జారీచేసిన అక్రిడేషన్ కార్డులు తహసిల్దార్లు చూసి వ్యాక్సిన్ వేయించాలన్నారు. ప్రస్తుతం ఇందుకోసం ఏర్పాటు చేస్తున్న 18 కేంద్రాలు ఇంతకుముందే కొనసాగుతున్న వాటికి అదనంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు.

ప్రతి కేంద్రంలోనూ మూడు కౌంటర్లు ఏర్పాటు చేసి శాఖల వారీగా వ్యాక్సినేషన్ వేసే విధంగా ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్ కొరకు ఎంపిక చేసిన వారికి సమాచారం అందించి ముందుగానే టోకెన్లు జారీ చేయాలని టోకెన్ల లో పోలీసువారికి లబ్ధిదారులను వ్యాక్సిన్ కొరకు అనుమతించే విధంగా ఒక సూచన కూడా ముద్రించాలని అధికారులకు సూచించారు.

సెల్ కాన్ఫరెన్స్ లో మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు వెంకటేశ్వర్లు, గోవింద్, వైద్య శాఖ అధికారులు, ఆర్డివో లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మొబైల్‌ కూరగాయల‌ వాహనాలు ప్రారంభం

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనసాగుతున్న లాక్‌ డౌన్‌ ను ద ృష్టిలో పెట్టుకొని ...

Comment on the article