Breaking News

31 లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావాలి

కామారెడ్డి, మే 27

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఈనెల 31 లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు.

గురువారం ఆయన సెల్ కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం కొనుగోలు పూర్తి కాని కేంద్రాలకు సంబంధించి ఆర్డిఓలు, తహశీలుదార్లు, ప్యాక్స్ సిఇఓలు, వ్యవసాయ ఎఓలు, సివిల్ సప్లయ్ అధికారులతో సమీక్షించారు. కొనుగోళ్లు పూర్తి అయిన కేంద్రాల నుండి హమాలీలు, యంత్ర పరికరాలు డైవర్ట్ చేసి మిగిలిన కొనుగోలు కేంద్రాలలో రైతుల నుండి వేగంగా కొనుగోళ్లు పూర్తి చేయాలని, ఈనెల 31 పూర్తి చేయాలని ఆదేశించారు.

మిల్లుల వద్ద లారీల అన్‌లోడింగ్ త్వరగా జరుగాలని, తిరిగి కొనుగోలు కేంద్రాల వద్దకు సత్వరమే లోడింగ్‌కు వెళ్లేలా తహశీలుదార్లు మిల్లు పాయింట్స్ వద్ద పర్యవేక్షించాలని, ధాన్యం రవాణా సులభతరం చేయాలని ఆదేశించారు.

కొనుగోళ్లు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ ముగించాలని, రైతుల ఖాతాల్లో సకాలంలో డబ్బు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. .

Check Also

డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా లాక్‌డౌన్‌ పరిశీల‌న

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ కేంద్రంలో లాక్‌ డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా ...

Comment on the article