Nizamabad News

గుండెపోటుతో పంచాయతీ కారోబార్‌ మృతి

  బీర్కూర్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం గ్రామానికి చెందిన పంచాయతీ కారోబార్‌ మాలోవత్‌ బీమా (40) గుండెపోటుతో మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల వివరాల ప్రకారం… పంచాయతీ కారోబార్‌గా గత పదిసంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం గ్రామ పంచాయతీలో విధులు నిర్వహించుకొని మద్యాహ్నం 12.30 గంటల సమయంలో ఇంటికి వెళ్ళి అకస్మాత్తుగా పడిపోయాడని, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. కాగా మృతునికి ఇద్దరు కుమారులు, కూతురు ఉందని …

Read More »

శ్రీచైతన్య, నారాయణ కార్పొరేట్‌ విద్యాసంస్థలు మూసివేయాలి

  – పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షుడు ఆజాద్‌ కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే శ్రీచైతన్య, నారాయణ వంటి కార్పొరేట్‌ విద్యాసంస్థలను తన్ని తరిమేస్తామని చెప్పిన కెసిఆర్‌, ఈరోజు కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నా అలాంటి సంస్థలపై చర్యలు తీసుకోకుండా వత్తాసు పలుకుతున్నారని పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షుడు ఆజాద్‌ అన్నారు. పిడిఎస్‌యు ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యార్థులతో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్‌ నుంచి ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహం వరకు …

Read More »

బ్లాక్‌ల ఏర్పాటు ద్వారా గిరిజనుల భూమి అభివృద్ధి

  కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో గిరిజన తెగల భూమి అభివృద్ధికి సంబంధించి బ్లాక్‌ల ఏర్పాటు ద్వారా భూమి అభివృద్ధి పరచడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. శనివారం ఆయన చాంబరులో నిర్వహించిన గిరిజన తెగల భూమి అభివృద్ధి కమిటీ సమావేశంలో మాట్లాడారు. వివిధ శాఖలతో కూడిన కమిటీ గిరిజనుల లబ్దిదారుల నిమిత్తం బ్లాక్‌ల నిర్మాణం చేస్తుందన్నారు. ఐదు ఎకరాలకు తగ్గకుండా ఒక బ్లాక్‌ ఎంపిక చేస్తారన్నారు. ఎక్కువ భూమి కలిగిన వారు లీడ్‌లో …

Read More »

బహిరంగ మలవిసర్జన రహిత సమాజాన్ని నిర్మిద్దాం

  కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బహిరంగ మలవిసర్జన రహిత సమాజానికి అందరు నడుం బిగించాలని, దీన్ని ప్రతి ఒక్కరు దైవకార్యంగా భావించి పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శనివారం స్తానిక రోటరీ క్లబ్‌లో గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, క్షేత్ర సహాయకులు, ఐకెపి సిబ్బందితో జిల్లా స్వచ్చభారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడో విడత వర్క్‌షాప్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బహిరంగ మలవిసర్జన రహిత కార్యక్రమంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు ప్రధాన భూమిక …

Read More »

గిరిజన విద్యార్థి పాదయాత్ర కరపత్రాల ఆవిష్కరణ

  కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరిజన విద్యార్థి జేఏసి ఆద్వర్యంలో నిర్వహించనున్న గిరిజన విద్యార్థి చైతన్య పాదయాత్రకు సంబంధించిన గోడప్రతులను శనివారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. గిరిజన విద్యార్థి సంఘం ఆద్వర్యంలో ఈనెల 26 నుంచి నవంబర్‌ 3 వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలుచేయకుండా అన్యాయం చేస్తుందని, హామీల అమలుకోసం బాన్సువాడ, ఎల్లారెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించనున్నామన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించకుండా డిఎస్‌సి, పోలీసు, అటవీశాఖ, …

Read More »

ఆదివారం నుంచి యధాతథంగా నీటి సరఫరా

  కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం నుంచి కామారెడ్డి మునిసిపాలిటితోపాటు 45 గ్రామాలకు యధాతథంగా మంచినీటి సరఫరా జరుగనున్నట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. సదాశివనగర్‌ మండలం మల్లన్నగుట్టవద్ద ఉన్న నీటి సరఫరా కేంద్రాన్ని శనివారం కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జలాల్‌పూర్‌ వద్ద గోదావరి నీటి సరఫరా పైప్‌లైన్‌ దెబ్బతిందని దాన్నిపునరుద్దరించే పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఆదివారం నుంచి నీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత 160 కోట్ల ప్రతిపాదనలతో …

Read More »

పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి

  – ఆర్మూర్‌ రూరల్‌ సిఐ నర్సింహాస్వామి నందిపేట, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని నందిపేట శారద కళాశాలలో పోలీసుల ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సభలో ఎస్‌ఐ సంతోష్‌ కుమార్‌ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్మూర్‌ రూరల్‌ సిఐ నర్సింహస్వామి ప్రసంగించారు. పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివని, వారి త్యాగాలు గుర్తుచేశారు. ప్రతి యేడు 21 అక్టోబరున అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఘనంగా …

Read More »

1402 అడుగులకు చేరిన నిజాంసాగర్‌ నీటి మట్టం

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు జలాశయంలో 1402.00 అడుగులకు వరదనీరు వచ్చి చేరిందని డిప్యూటి ఇఇ దత్తాత్రి తెలిపారు. ప్రాజెక్టు ఎగువ భాగంలోగల సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో నిజాంసాగర్‌ ప్రాజెక్టు జలాశయం జలకళను సంతరించుకుందన్నారు. సింగూరు ప్రాజెక్టు జలాశయంలో ఎగువ ప్రాంతంనుంచి వరద రాకపోవడం వల్ల వరదగేట్లను నీటిపారుదల శాఖాధికారులు మూసిఉంచారు. సింగూరు ప్రాజెక్టు జల విద్యుత్‌ కేంద్రం గేట్ల ద్వారా 1300 క్యూసెక్కుల నీటిని …

Read More »

చెట్లు కాపాడండి

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం పథకం కింద నాటిక ప్రతి మొక్కను కాపాడడంలో అందరు బాధ్యత వహించాలని గున్కుల్‌ సొసైటీ ఛైర్మన్‌ సయ్యద్‌ మోయినుద్దీన్‌ అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ ఎదుట నాటిన మొక్కలకు అధికారులు నీరందేలా చూసి కాపాడాల్సిన బాద్యత ఉందన్నారు. మొక్కల కోసం చేసిన ఖర్చు ఏ ప్రభుత్వం చేయలేదని, లక్షలు మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. ప్రకృతిని సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరు చేపట్టాలని అన్నారు. చెట్టు బాగుంటే ప్రజలు బాగుంటారని …

Read More »

కెజిబివిలో విద్యార్థినిలకు వైద్య పరీక్షలు

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినిలకు శనివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌బిఎస్‌కె వైద్యురాలు డాక్టర్‌ సాధన, విఠల్‌రాజులు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కావాల్సిన వైద్య సలహాలు, సూచనలు చేశారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని, శుభ్రత పాటిస్తే ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉంటారని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సరోజన, సుమన్‌బాయి, పార్మాసిస్టు సౌమ్య, …

Read More »