Breaking News

Nizamabad News

ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలి

రెంజల్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఎంపీపీ మొబిన్‌ ఖాన్‌ అన్నారు. శుక్రవారం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ మోబిన్‌ ఖాన్‌ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రధాన శాఖల అంశాలను పరిగణనలోకి తీసుకుని మిగతా శాఖలను కొనసాగించకుండానే మండల సర్వసభ్య సమావేశం ముగించారు. వ్యవసాయ శాఖ, ట్రాన్స్‌కో, ఆర్‌డబ్ల్యుఎస్‌, ఆర్‌అండ్‌బి శాఖల అధికారుల పనితీరుపై ఎంపిటిసిలు, సర్పంచ్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రాన్స్‌ కో ...

Read More »

పాఠశాలల తనిఖీ

రెంజల్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కస్తూర్బా గాంధీ, తెలంగాణ మోడల్‌ స్కూల్‌, దూపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో ప్రార్థన సమయానికి హాజరైన జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్‌ తదుపరి తెలంగాణ మోడల్‌ పాఠశాల, దూపల్లి పాఠశాలలు తనిఖీ చేశారు. పాఠశాలకు సంబంధించిన రిజిస్టర్లు, విద్యార్థుల హాజరు శాతం, అడ్మిషన్ల రిజిస్టర్‌, నెలవారి సిలబస్‌, టీచర్‌ డైరీలు పరిశీలించిన ఆయన విద్యార్థులు, ...

Read More »

పిఆర్‌టియు సభ్యత్వ నమోదు

బీర్కూర్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలో శుక్రవారం పిఆర్‌టియు సభ్యత్వ నమోదు కార్యక్రమం అధ్యక్షుడు కొప్పిశెట్టి శ్రీనివాస్‌ అధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల్లోని పాఠశాలల్లో నిర్వహించారు. గత విడత యుపిఎస్‌ మైలారంను దత్తత చేసుకొని అభివద్ధి చేశామని, ఈ సంవత్సరం బొమ్మన్‌దేవుపల్లి జడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాలను అభివద్ధి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ఉన్నతమైన విద్య కోసం పాటుపడతామని కొప్పిశెట్టి శ్రీనివాస్‌ అన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గున్గెఉరీ హనుమాండ్లు, జిల్లా బాధ్యులు భూషన్‌, శ్రీచంద్‌, మండల ఉపాధ్యాయులు ...

Read More »

ప్రవేశ పరీక్ష తేదీలో మార్పు

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర షెడ్యూలు కులాల స్టడీ సర్కిల్‌ వారు రాష్ట్ర స్థాయి ఉద్యోగ పోటీ పరీక్షలకు గాను నిజామాబాద్‌లో తలపెట్టిన అయిదున్నర నెలల ఉచిత శిక్షణ ప్రవేశ అర్హత కొరకు ఈనెల 30న నిర్వహించదలచిన ప్రవేశ పరీక్ష జూలై ఏడవ తేదీన కేర్‌ డిగ్రీ కళాశాల నిజామాబాద్‌లో జరుగుతుందని షెడ్యూలు కులాల అభివద్ధి అధికారి సబీల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే హాల్‌టికెట్లు రెండు రోజుల ముందు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. మరింత ...

Read More »

అటవీ – రెవెన్యూ భూముల రికార్డులు సరి చూసుకోవాలి

నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ – రెవెన్యూ శాఖలకు సంబంధించి భూముల వివాదాలను సంయుక్తంగా పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎం వెంకటేశ్వర్లు రెండు శాఖల అధికారులను కోరారు. గురువారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో అటవీ భూముల రికన్సిలేషన్‌, ఎల్‌ఆర్‌ యుపి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, పౌరసరఫరాలు, ఇతర రెవిన్యూ విషయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరుశాఖల అధికారులు వారి వద్ద అందుబాటులో ఉన్న రికార్డులను గ్రామస్థాయిలో ఉన్న రికార్డులను ...

Read More »

ఒడిస్సా తుఫాన్‌ బాధితులకు సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం సహాయం

నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒరిస్సా రాష్ట్రంలోని ఫని తుఫాను బాధితులకు జిల్లా కేంద్రంలోని సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం ఆర్థిక సహాయాన్ని అందించారు. గురువారం జిల్లా కలెక్టర్‌ చాంబర్‌లో కలెక్టర్‌ను కలిసి వారు రూ. 36,000 చెక్కును ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఫోరం ప్రతినిధులను అభినందిస్తూ పెద్ద వయసులో కూడా వారు పలు సామాజిక సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవడం అభినందనీయమని, ఇప్పటికే వరద బాధితుల ...

Read More »

నీటి సంరక్షణకు ప్రాధాన్యం – కేంద్ర క్యాబినెట్‌ సెక్రటరీ

నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీటి సంరక్షణకు రాష్ట్రాలు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్స్‌ కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ సిన్హా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు, జిల్లాల కలెక్టర్లకు తెలిపారు. గురువారం ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జల్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమంపై మాట్లాడారు. చాలా ప్రాంతాలలో నీటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని అందుకు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉందని తెలిపారు. ఆయా రాష్ట్రాలు నీటిని సంరక్షించుకోవడానికి నీటిని శుద్ధి చేసుకోవడానికి వర్షపునీటిని ఒడిసి ...

Read More »

నందిపేట్‌లో కార్డేన్‌ సర్చ్‌

63 వాహనాల స్వాధీనం నిజాంసాగర్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలో గురువారం సాయంత్రం కార్డెన్‌ సర్చ్‌ నిర్వహించారు. ఆర్మూర్‌ డివిజన్‌ స్థాయిలోని సిఐలు, ఎస్‌ఐ లు, సిబ్బంది, స్పెషల్‌ పార్టీ పోలీసులు బందాలుగా వెళ్లి రాజ్‌ నగర్‌ దుబ్బలోని ఇంటిటికి తిరిగి వాహనాలు, పత్రాలు తనిఖీ చేశారు. ఆర్మూర్‌ డివిజన్‌ ఏసిపి అందె రాములు కార్డేన్‌ సెర్చ్‌ పర్యవేక్షించారు. ఇళ్లలో పత్రాలు లేని వాహనాలను తమ అధీనంలో తీసుకొని కొత్తూర్‌ రోడ్‌లోని గోదాంలో ఉంచారు. తనిఖీల్లో ...

Read More »

నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి

నిజాంసాగర్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని బోధన్‌ నీటిపారుదల శాఖ ఈఈ మధుకర్‌ రెడ్డి అన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటి మట్టాన్ని పరిశీలించారు. అలాగే ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలోని కళ్యాణి ప్రాజెక్టు గ్రీసింగ్‌ ఆయిల్‌ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం కావడంతో కళ్యాణి, సింగీతం, నిజాంసాగర్‌ ప్రాజెక్టులకు గ్రిసింగ్‌ ఆయిల్‌ పనులను వేగంగా చేయాలని అధికారులను సూచించారు. వర్షాకాలంలో నీటి ప్రవాహం పెరిగే అవకాశముండడంతో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ...

Read More »

ఐటిఐ అడ్మిషన్‌ గడువు పొడగింపు

కామారెడ్డి, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐటిఐలో అడ్మిషన్‌లో దరఖాస్తుల కోసం ఈనెల 26 చివరి తేదీ కాగా, జూలై 1వ తేదీ వరకు పొడిగించినట్టు ఐటిఐ ప్రిన్సిపాల్‌ వెంకటశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేయదలచుకున్న వారు జూలై 1 లోగా ఆన్‌లైన్‌ ఱ్‌ఱ్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఇది వరకే దరకాస్తు చేసుకొని సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరుకాని విద్యార్తులు ఈనెల 28న తెలంగాణలోని అన్ని ఐటిఐలలో సర్టిపికెట్‌లు వెరిఫికేషన్‌ చేసుకోవచ్చని వివరించారు.

Read More »

సివిల్స్‌ అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌

కామారెడ్డి, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు చెందిన బిసి, ఎస్‌సి, ఎస్‌టి యుపిఎస్‌సి సివిల్స్‌కు హైదరాబాద్‌లో ఉచిత కోచింగ్‌ ఇవ్వనున్నట్టు బిసి స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ సి.హెచ్‌.వెంకన్న ప్రకటనలో తెలిపారు. ఈనెల 23 నుంచి జూలై 20 లోగా షషష.ర్‌బసవషఱతీషశ్రీవ.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ ద్వారా అభ్యర్తులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఆగష్టు 4న ఆన్‌లైన్‌లో స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహిస్తారన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉస్మానియా యూనివర్సిటీ బిసి స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇస్తారని ...

Read More »

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం

కామారెడ్డి, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో అర్హులైన ఎస్‌సి, ఎస్‌టి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు టిఎస్‌ఐపాస్‌, టిప్రైడ్‌ ద్వారా పెట్టుబడి సబ్సిడీ అందించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. గురువారం ఆయన అధ్యక్షతన జిల్లా ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 8 ఎంటర్‌ప్రైజెస్‌లకు ఎస్‌సిపి, టిఎస్‌పి విభాగాలకు 23 లక్షల 54 వేల 479 రూపాయలను మంజూరు లభించిందని, మహిళలకు 45 శాతం సబ్సిడీతో ఆమోదం లభించినట్టు వివరించారు. సమావేశంలో జిల్లా ...

Read More »

జిల్లాలో ఇసుక లభ్యతపై నివేదిక అందజేయాలి

కామారెడ్డి, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లాలో ఇసుక లభ్యతపై అధికారులు పూర్తిస్థాయి నివేదికలు సిద్దం చేయాలని కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం ఆయన జిల్లా మైన్స్‌, బూగర్భజలాలు, ఇరిగేషన్‌ శాఖల అదికారులతో సమీక్షించారు. వివిధ అభివృద్ది కార్యక్రమాలకు అవసరమైన ఇసుక జిల్లాలో 46 వేల క్యూబిక్‌ మీటర్లు అందుబాటులో ఉందని తెలిపారు. దీనికి సంబంధించి అన్ని శాఖలు సంయుక్తంగా చర్యలు చేపట్టి నివేదికలు ఇవ్వాలన్నారు. మాచారెడ్డి మండలం లచ్చాపేట గ్రామంలో అప్పర్‌ ...

Read More »

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు కామారెడ్డి, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామ శివారులోని జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు సంఘటన స్థలంలోనే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌ నుంచి బాసరకు వెళ్తున్న కారు అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామ శివారులోకి రాగానే అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని అవతలవైపు రోడ్డుపై వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ సంఘటనలో సునీత, ...

Read More »

మండల కేంద్రంలో హీరో సంపూర్ణేష్‌బాబు సందడి

నసురుల్లాబాద్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో బుధవారం సినీ ప్రముఖులు సందడి చేశారు. గ్రామంలో బుధవారం ‘రాగల 24 గంటలు’ సినీ నిర్మాత కె.శ్రీనివాస్‌ మిత్రుని కుమార్తె ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో సంపూర్ణేష్‌ బాబు కాబోయే దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్బంగా గ్రామంలోని యువకులతో సెల్ఫీలు దిగారు. సంపూర్ణేష్‌ను చూడటానికి యువకులు ఉత్సాహపడ్డారు.

Read More »

అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులకు సూచించారు. బుధవారం తన చాంబరులో జిల్లా ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక వనరుల లభ్యతపై సమీక్షించారు. రెండు పడక గదుల ఇళ్లు, ఆర్‌అండ్‌బి, ప్రభుత్వ, ప్రయివేటు నిర్మాణాలకు సంబంధించి 6 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక అవసరముంటుందని తెలిపారు. ఇసుక లభ్యతపై జాయింట్‌ సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని జిల్లా ఖని భూగర్భశాఖ, భూగర్భ జలవనరుల ...

Read More »

అటవీశాఖ ద్వారా 95 లక్షల మొక్కల పెంపకం

కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో అటవీశాఖ ద్వారా మొత్తం 95 లక్షల మొక్కలను పెంచడం జరిగిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ హైవే వెంట మొక్కలు నాటే కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొని అంతంపల్లి నర్సరీ వద్ద హైవే వెంబడి మొక్కలు నాటారు. నేషనల్‌ హైవే బస్వాపూర్‌ నుంచి దగ్గి వరకు 56 కి.మీల వెంబడి 7 వేల 100 మొక్కలు నాటడం లక్ష్యంలో ...

Read More »

ప్రభుత్వ నిర్మాణాలకు ఇసుక అందించాలి

కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల నిర్మాణ పనులకు అవసరమైన ఇసుకను లభ్యత ప్రాంతాల నుంచి అందించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, తెలంగాణ రాష్ట్ర మైన్స్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ కమీషనర్‌ మల్సర్‌లతో కలిసి కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం నర్మల గ్రామం వద్దగల అప్పర్‌ మానేరు ప్రాజెక్టు కింద లభ్యమయ్యే ఇసుకను పరిశీలించారు. ప్రాజెక్టు ప్రదేశంలో ఇసుకతీత, ఇసుక లభ్యతపై వెంటనే ...

Read More »

వేతనాల కోసం బల్దియాకు తరలిన కార్మికులు

కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ విలీన గ్రామాల కార్మికులు తమ వేతనాల కోసం బుధవారం కామారెడ్డి బల్దియా కార్యాలయాన్ని ముట్టడించారు. మునిసిపల్‌ సమావేశ మందిరంలోకి చొచ్చుకొని వచ్చి ఛైర్మన్‌కు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆరునెలల నుంచి తమకు వేతనాలు ఇవ్వడం లేదని, మునిసిపల్‌ విలీన గ్రామాల కార్మికులమైన తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అక్కడి నుంచి నిష్క్రమించడంతో కార్మికులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకపక్క తాము వేతనాలు రాక ...

Read More »

పారిశుద్య పనుల పరిశీలన

నిజాంసాగర్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మంగుళూర్‌ గ్రామంలో పారిశుద్ధ్య పనులను పంచాయతీ కార్యదర్శి బాలరాజు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వాన కాలం ప్రారంభం కావడంతో మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముందస్తుగా పారిశుద్ధ్య పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. ఆయన వెంట సర్పంచ్‌ గైని స్వప్న రమేష్‌, తదితరులు ఉన్నారు.

Read More »