Breaking News

Nizamabad News

పారిశుద్య పనులు పర్యవేక్షించిన నగర మేయర్‌

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని జోన్‌ 1 పరిదిలోని 37వ డివిజన్‌, 16వ డివిజన్‌ అదేవిధంగా జోన్ 4 పరిదిలోని బైపాస్‌ రోడ్డులో జరుగుతున్న పారిశుద్ద పనుల‌ను, స్ట్రోమ్‌ డ్రైనేజ్‌ వాటర్‌ పూడికతీత పనుల‌ను శుక్రవారం నిజామాబాద్‌ నగర మేయర్‌ నీతూ కిరణ్‌ పర్యవేక్షించారు. వ‌ర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలో ఎక్కడ కుడా నీరు నిలువ‌కుండా ఉండేందుకు తీసుకోవల‌సిన చర్యల‌ గురించి అధికారుల‌కు సూచనలు చేశారు. ప్రజలు కుడా తడి, పొడి చెత్త వేరుచేసి మున్సిపల్‌ ...

Read More »

మాస్కులు పంపిణీ చేసిన కార్పొరేటర్‌

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని 28వ డివిజన్‌ కార్పొరేటర్ ఇల్లందు మమత ప్రభాకర్‌ తమ డివిజన్‌లో శుక్రవారం ఇంటింటికి తిరుగుతూ మాస్కులు పంపిణీ చేశారు. సుమారు వెయ్యి మాస్కులు పంపిణీ చేసినట్టు తెలిపారు. అదేవిధంగా కరోనా కట్టడి కోసం సామాజిక దూరం పాటించాల‌ని, మాస్కు తప్పకుండా ధరించాల‌ని డివిజన్‌ వాసుల‌కు అవగాహన కల్పించారు.

Read More »

మొక్కజొన్నే గాంధారి ప్రాంత రైతుల‌ జీవనాధారం

గాంధారి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో చాలా ప్రాంతాలు ఎత్తైన ప్రాంతాలుగా ఉండడం, వర్షాధార పంటల‌కు అనుకూలం కావడంతో మక్కజొన్న తప్పించి మరే పంట కూడా రాలేని స్థితి ఉందని ఇక్కడి రైతులు అంటున్నారు. రైతులు ఊహించని విధంగా మొక్కజొన్న సాగు చేయవద్దని సీఎం కేసీఆర్‌ ప్రకటించడం రైతు వ్యతిరేక చర్యల‌కు నిదర్శనమన్నారు. ఆయా గ్రామాల్లోని రైతులు మొక్కజొన్న పంట సాగు చేయకపోతే రైతు తమ భూముల‌ను వదులుకొని అప్పుల పాల‌య్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ...

Read More »

‘తెలంగాణ రత్న’ పురస్కారానికి దరఖాస్తుల‌ ఆహ్వానం

హైదరాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్‌ 14వ తేదీన హైదరాబాద్‌ నగరంలో నిర్వహించే తెలంగాణ రత్న పురస్కారాల‌ ప్రదానోత్సవానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆల్‌ ది బెస్ట్‌ ఆర్ట్స్‌ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు యన్‌ డాక్టర్‌ ఇ.ఎస్‌.ఎస్‌ నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. కవులు, రచయితలు, సంగీత, నృత్య, రంగస్థల‌, యోగ, వైద్య, క్రీడాకారుల‌ సేవల‌కు గాను పురస్కారం ప్రదానం చేసి వారిని ప్రోత్సహించాల‌నే ల‌క్ష్యంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఆసక్తిగల‌వారు ...

Read More »

కార్మిక చట్టాలు అమలు చేయాలి

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యాయం ముందు శుక్రవారం ధర్నా నిర్వహించి ఆర్‌డిఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐసిటియు జిల్లా బాధ్యుడు రాజలింగం మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కరోనా కట్టడి కోసం గత 70 రోజులుగా విధించిన లాక్‌ డౌన్ వ‌ల్ల‌ దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ కార్మిక వర్గం వేతనాలు రాకా ఉపాధి లేక బిచ్చగాళ్ళుగా మారుతున్నా పట్టించుకోకుండా ...

Read More »

కళ్యాణల‌క్ష్మి చెక్కుల‌ పంపిణీ

నిజాంసాగర్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పిట్లం మండల‌ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాల‌య ఆవరణలో రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే 14 మంది ల‌బ్ధిదారుల‌కు కల్యాణ ల‌క్ష్మి చెక్కుల‌ను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోన నేపథ్యంలో ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాల‌న్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కవిత విజయ్‌, సర్పంచ్‌ విజయల‌క్ష్మి, నాయకులు తదితరులు ఉన్నారు.

Read More »

మునిసిపల్‌ సమస్యలు పరిష్కరించాల‌ని ఆర్‌డివోకు వినతి

ఎల్లారెడ్డి, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఎల్లారెడ్డి ఇంచార్జి ఆర్‌డివో వెంకటేష్‌ దోత్రేని గురువారం కాంగ్రెస్‌ మున్సిపల్‌ కౌన్సిల‌ర్లు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. మున్సిపల్‌ పరిదిలోని పలు వార్డుల్లో ముఖ్యంగా 2వ, 6వ, 9వ వార్డుల్లోని మురికి కాలువల‌ సమస్య, నీటి సమస్య ఉందని, ఎల్లారెడ్డిలోని ప్రదాన మురికి కాలువ నిర్మాణం జరిపినప్పటినుండి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో చెత్త తొల‌గించలేదని అన్నారు. రాబోయేది వర్షాకాలం కావున వెంటనే మున్సిపల్‌లోని పలు సమస్యల‌పై స్పందించాల‌ని ఈ ...

Read More »

కోరుట్లలో అగ్నిప్రమాదం

కోరుట్ల, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోరుట్ల పట్టణంలో కాలేజీ గ్రౌండ్‌లోని మిని స్టేడియం వద్ద ప్రమాదవశాత్తు ప్లాస్టిక్‌ వైర్‌ కేబుల్‌కు మంటలు అంటుకుని అగ్ని ప్రమాదం జరిగింది. గమనించిన స్థానిక యువకులు మంటలు ఆర్పేప్రయత్నం చేశారు.

Read More »

పారిశుద్య సిబ్బందికి సన్మానం, నిత్యవసరాల‌ పంపిణీ

నిజాంసాగర్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల‌ కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో వల‌స కూలీల‌కు నిరుపేద కుటుంబాల‌కు రేషన్‌ కార్డు లేని వారిని గుర్తించి 20 కిలోల‌ బియ్యం, నిత్యావసర సరుకుల‌ను సర్పంచ్‌ రేఖ రాజు, తహసీల్దార్‌ వెంకట్రావు, ఎంపీడీవో ఆనంద్‌ చేతుల‌ మీదుగా పంపిణీ చేశారు. ముందుగా పారిశుద్ధ్య కార్మికుల‌కు సన్మానం చేశారు. అలాగే వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తల‌కు గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం చేసి నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ ...

Read More »

సిఎం సహాయనిధికి రూ.61 ల‌క్ష‌లు

హైదరాబాద్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల‌కు సాయంగా తెలంగాణ రాష్ట్రంలోని న్యాయాధికారులు, జ్యూడిషియల్‌ అధికారులు తమ ఒకరోజు వేతనాన్ని రూ. 61 ల‌క్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు. దీనికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావుకు రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి అందించారు. న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్‌ రెడ్డి, హైకోర్టు రిజిస్ట్రార్‌ కార్యక్రమంలో పాల్గొనారు.

Read More »

ల‌క్ష రూపాయల‌ రైతు రుణమాఫీ చేయాలి

బీర్కూర్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో రైతుబంధు పథకాన్ని వెంటనే అమలు చేయాల‌ని, ల‌క్ష రూపాయల‌ రైతు రుణాల‌ను మాఫీ చేయడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల‌ని నసురుల్లాబాద్‌ మండల‌ భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు గురువారం తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బిజెపి మండల‌ అధ్యక్షుడు హన్మాండ్లు యాదవ్‌ మాట్లాడుతూ 2018 అసెంబ్లీ ఎన్నికల‌కు ముందు రైతుబంధు పథకం కింద డబ్బు ఏ ప్రాతిపదికన రైతు ఖాతాలో జమచేశారో అదే ...

Read More »

స్వర్గీయ రాజీవ్‌గాంధీకి ఘన నివాళి

బాన్సువాడ, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాల‌యంలో డీసీసీ అధ్యక్షుడు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కైలాస్‌ శ్రీనివాసరావు, పండ్ల రాజు పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ కార్యకర్తలు రాజీవ్‌ గాంధి విగ్రహం వద్ద, చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కైలాస్‌ శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ ఎల్టీటీఈ దాడిలో కన్నుమూసి నేటికి 29 ఏళ్లు అవుతుందని, 1991వ సంవత్సరం మే ...

Read More »

న్యాయ్‌ యోజన పథకం వర్తింపజేయాలి

వర్ని, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్‌ గాంధీ వర్దంతి సందర్బంగా యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు గురువారం రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కూనీపూర్‌ రాజారెడ్డి ఆధ్వర్యంలో బాన్సువాడ నియోజకవర్గం మొస్రా మండలంలో ‘‘న్యాయ్‌ యోజన పథకం’’ వర్తింపజేయాల‌ని తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న చాలా మంది పేదల‌ను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాల‌ని డిమాండ్‌ చేశారు. నిరుపేదల‌కు న్యాయ్‌ యోజన పథకం వర్తింపజేయాల‌ని, దేశ వ్యాప్తంగా వచ్చే ఆరు నెల‌ల ...

Read More »

రైతుబంధు, రుణమాఫీ షరతులు లేకుండా అమలు చేయాలి

ఆర్మూర్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఆర్మూర్‌ పట్టణ శాఖ, మండల‌ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఆర్డిఓ కార్యాల‌యం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల‌ శివరాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ రైతుకు రైతు బంధు పథకం గాని, ల‌క్ష రూపాయల‌ రుణ మాఫీ చేయకపోవడం చాలా శోచనీయమని అన్నారు. ప్రభుత్వం తాము చెప్పిన పంటలు వేయాల‌ని అనడం, అలాగే 20 ల‌క్షల‌ కోట్ల రూపాయల‌ ...

Read More »

కరోనా కట్టడిలో భాగంగా రసాయన ద్రావణం పిచికారీ

నిజాంసాగర్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాగిరెడ్డి పెట్‌ మండలం గోలి లింగా గ్రామంలో గురువారం హైడ్రోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేశారు. మండల‌ కేంద్రంలో జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మదన్‌ మోహన్‌ రావు ట్రస్టు సంఘం సౌజన్యంతో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఓజెన్‌ రసాయనం, సోడియం హైడ్రోక్లోరైడ్‌ ద్రావణాన్ని పూర్తి స్థాయిలో పిచికారి చేసే కార్యక్రమాన్ని జెడ్పిటిసి మనోహర్‌ రెడ్డి, ఎంపీపీ రాజు దాసు ప్రారంభించారు. అంతకుముందు మండల‌ ప్రజల‌ క్షేమం కోసం కరోనా వైరస్‌ ...

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం గర్భిణీల‌కు రక్తదానం

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన బాల‌వ్వ (20), బిక్నూర్‌ మండల‌ కేంద్రానికి చెందిన లావణ్య (24), శాబ్ధి పూర్‌ గ్రామానికి చెందిన చంద్రబాగుకు ఆపరేషన్‌ నిమిత్తమై బి నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహంను సంప్రదించారు. సమూహ సభ్యుడు కిరణ్‌ సహకారంతో కామారెడ్డి పట్టణానికి చెందిన సంతోష్‌ కుమార్‌, గాలి శ్రీకాంత్‌, ల‌చ్చ పేట గ్రామానికి చెందిన దేవరాజు సహాయంతో 3 యూనిట్ల రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడినట్లు ...

Read More »

మొక్కజొన్న పంట వ‌ల్ల‌ నష్టం వాటిల్లుతుంది

నిజామాబాద్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రాబోయే వానాకాలంలో వ్యవసాయంపై సంబంధిత అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. బుదవారం జిల్లాలోని అగ్రిక‌ల్చ‌ర్‌, హార్టిక‌ల్చ‌ర్‌ అధికారులు, తహసీల్దార్‌లు, తదితరుల‌తో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 108 క్లస్టర్‌ కుగాను, 90 క్లస్టర్‌కు సొంత భవనాలు ఉన్నాయని, మిగితా క్లస్టర్‌ల‌కు బిల్డింగ్‌ లేనందున, వాటికి ల్యాండ్‌ రేపటిలోగా చూసి రిపోర్ట్‌ పంపవల్సిందిగా కలెక్టర్‌ ఆదేశించారు.   అదేవిధంగా జిల్లాలో మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా ఏ ...

Read More »

టెక్నో స్కూల్‌ను తరిమి కొడతాం….

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌ కార్పొరేట్‌ పాఠశాల‌ ప్రారంభించకుండానే విద్యార్థుల‌ తల్లిదండ్రుల‌కు, అనేక మందికి పోన్‌ చేస్తున్నారని, పాఠశాల‌కు ఎలాంటి అనుమతి లేకుండానే కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని, అయినా అధికారులు నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కామారెడ్డి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ ప్రతినిధులు అన్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోకపోతే జరిగబోయే పరిణామాల‌కు అధికారులే బాద్యత వహించవల‌సి ఉంటుందని హెచ్చరించారు. కేవలం డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే పాఠశాల‌ ప్రారంభిస్తున్నారని, విద్యార్థుల‌ జీవితాలు ...

Read More »

న్యాయవాది మృతికి సంతాపం

నిజామాబాద్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీనియర్‌ న్యాయవాది ల‌ద్దారాం రాంల‌ఖియాని బుధవారం మృతి చెందారు. వారి మృతి పట్ల నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అత్యవసరంగా సమావేశమై సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గోవర్దన్‌ మాట్లాడుతూ సీనియర్‌ న్యాయవాది ల‌ద్దారాం న్యాయవాద వృత్తిలో గౌరవ ప్రదంగా ఉంటూ, అసోసియేషన్‌లో అందరితో కలిసి మెలిసి ఉండేవారని, వారి మృతి తీరని లోటన్నారు. 67 సంవత్సరాల‌ పాటు సుదీర్ఘంగా న్యాయవాద వృత్తిలో కొనసాగారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మౌనం పాటించి శ్రద్దాంజలి ...

Read More »

కామారెడ్డి మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌గా చాట్ల రాజేశ్వర్‌

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో బుధవారం జరిగిన సమావేశంలో మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌, డిసిసి అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాసరావు కామారెడ్డి పట్టణ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌గా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, 38వ వార్డు కౌన్సిల‌ర్‌ అయిన చాట్ల రాజేశ్వర్‌ను నియమించారు. కాగా షబ్బీర్‌ అలీ చేతుల‌మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.

Read More »