Breaking News

Nizamabad News

ప్రజావాణిలో 61 ఫిర్యాదులు

కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 61 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 28 పిర్యాదులు, వ్యవసాయశాఖ- 7 ఫిర్యాదులు, డిపివో – 4, వైద్యశాఖ – 4 ఫిర్యాదులు, బిసి వెల్పేర్‌- 4, మిగతా శాఖలకు సంబందించి పిర్యాదులు అందాయన్నారు. వాటిని వెంటనే పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు ఉత్తర్వులు జారీచేశారు.

Read More »

మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పనులు ప్రారంభం

రెంజల్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలో సోమవారం మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పనులను సర్పంచ్‌ రమేశ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంట్ట్రార్‌ పనులలో నాణ్యత పాటించి త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు చేపట్టిన పైప్‌లైన్‌ పనులను త్వరగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సాయిబాబా గౌడ్‌, గంగాగౌడ్‌, రమేశ్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

మా డబ్బులు మాకివ్వండి

రెంజల్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత రెండు నెలల నుండి పింఛన్‌ డబ్బులు ఇవ్వడం లేదంటూ కూనేపల్లి గ్రామస్తులు సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. పోస్టుమాన్‌ ఇష్టారీతిన పింఛన్‌ డబ్బులు ఇంటివద్దే పంచుతున్నాడని, గ్రామ పంచాయతీ వద్ద డబ్బులు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. గత రెండు నెలల నుంచి పింఛన్‌ డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, తమ డబ్బులు తమకు ఇవ్వాలంటూ గ్రామ పంచాయతీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సర్పంచ్‌ విజయ గ్రామ పంచాయతీకి చేరుకొని ...

Read More »

డయల్‌ యువర్‌ సిపికి 9 ఫిర్యాదులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ప్రతిసోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సిపి కార్యక్రమానికి 9 ఫిర్యాదులు అందాయి. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోదన్‌ డివిజన్‌ల నుంచి ప్రజలు డయల్‌ యువర్‌ సిపి ద్వారా సిపికి తాము ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. వీటిపై సిపి స్పందిస్తు బాధితులకు సత్వర న్యాయం చేస్తామని, ఫిర్యాదుల్లో పేర్కొన్న విధంగా సంబందిత పోలీసు అదికారులకు తెలియపరిచి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలోని ప్రజలు ఏమైనా సమస్యలుంటే డయల్‌ ...

Read More »

సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసతిగృహ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అనేక సంవత్సరాల నుంచి సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో కార్మికులు ఉద్యోగులుగా పనిచేస్తున్నారని, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల బతుకులు ఘోరంగా ఉన్నాయని ఆరోపించారు. వారితో ప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తోందని, రోజుకు పదిగంటల పని చేయించుకుంటు శ్రమదోపిడి చేస్తున్నారని ఆమె ...

Read More »

పండిత్‌ దీనదయాళ్‌కు ఘన నివాళి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పండిత్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ బలిదాన దివస్‌ పురస్కరించుకొని సోమవారం నిజామాబాద్‌ భారతీయ జనతాపార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యులు యెండల లక్ష్మినారాయణ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగున ఉన్న నిరుపేదలకు సైతం అభివృద్ది ఫలాలు చేరాలన్న దీన్‌ దయాళ్‌ అంత్యోదయ స్ఫూర్తితోనే ప్రధాని మోడి పాలన కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అర్వింద్‌, బస్వా లక్ష్మినర్సయ్య, ...

Read More »

న్యాయవాదుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవాదుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీహరి ఆచార్య, జగన్‌మోహన్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావుకు వినతి పత్రం అందించి అనంతరం వారు మాట్లాడారు. న్యాయవాద వృత్తిని రక్షించాల్సిన అవసరాన్ని వివరించారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడికి కలెక్టర్‌ ద్వారా వినతి పత్రం అందించడం జరిగిందని, న్యాయవాదులకు 20 లక్షల వరకు బీమా, ఉచిత ఆరోగ్య సేవలు, ప్రతి బార్‌ అసోసియేషన్‌కు సొంత ...

Read More »

చెక్కుల పంపిణీ

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బిసి కార్పొరేషన్‌ ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్‌ లబ్దిదారులకు అందజేశారు. మొత్తం 279 మంది లబ్దిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిసిల పట్ల ప్రభుత్వం వైఖరి మార్చుకొని వారు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ది చెందడానికి కృషి చేయాలని కోరారు. దేశంలో, రాష్ట్రంలో బిసి జనాభా ఎక్కువ ఉన్నా రాజ్యాంగ పదవులు మాత్రం తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ...

Read More »

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

నిజామాబాద్‌ ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న పదవతరగతి, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రగతిభవన్‌ సమావేశమందిరంలో సంబంధిత శాఖాధికారులతో పదవతరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఈనెల 27 నుంచి మార్చి 18 వరకు ఉంటాయని, ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తుందన్నారు. పరీక్షలకు ప్రథమ సంవత్సరం విద్యార్థులు 18 ...

Read More »

ఈవిఎంల పరిశీలన

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం పలు రాజకీయ పార్టీల ప్రతినిదుల సమక్షంలో ఈవిఎంల పరిశీలన, మాక్‌పోలింగ్‌ను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు పరిశీలించారు. ఎఫ్‌ఎల్‌సి గోదాములో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవిఎంల మాక్‌పోలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటు వేసేముందు ఈవిఎం, వీవీప్యాట్‌కు బియుఎల్‌ టెక్నికల్‌ పారామీటర్‌కు సంబంధించిన ఏడు స్లిప్పులు వస్తాయని స్లిప్పుల యంత్రాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించిన తర్వాతే ఓటింగ్‌ మొదలవుతుందని కలెక్టర్‌ వివరించారు. మొత్తం ఈవిఎంలలో ఎన్నికల ...

Read More »

మర్చంట్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ఎన్నికలు సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రద్దానంద్‌ గంజ్‌లో జరిగాయి. అధ్యక్షుడుగా రాజేష్‌ దాలియా, ప్రధాన కార్యదర్శిగా బచ్చు పురుషోత్తం, కోశాధికారిగా కొత్తపల్లి సంతోష్‌ ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి పూనం చంద్‌ గుప్త వెల్లడించారు. నూతన కార్యవర్గం రెండేళ్లపాటు తమ సేవలు అందిస్తుందని ఆయన తెలిపారు. అనంతరం అధ్యక్షులుగా ఎన్నికైన రాజేశ్‌ దాలియా మాట్లాడుతూ గంజ్‌ అభివృద్దికి, కార్మికుల సంక్షేమానికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని, నిజామాబాద్‌ ...

Read More »

మధుయాష్కీని పార్టీనుంచి సస్పెండ్‌ చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవినీతిపరుడైన నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ను తక్షణమే కాంగ్రెస్‌ పార్టీ నుండి సస్పెండ్‌ చేయాలని, గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్‌ పార్లమెంట్‌లో ఒక్క స్థానంలో కూడా ప్రచారానికి రాకుండా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి కారణమైన మధుయాష్కీకి కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగే నైతిక హక్కు లేదని కోరుట్ల మండల కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ గోనెప్రసాద్‌, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మొహమ్మద్‌ రజాక్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ...

Read More »

రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేయాల్సిన అవసరముంది

జగిత్యాల, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేయాల్సిన అవసరముంది భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్‌ అన్నారు. వసంత పంచమి సందర్బంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని చాణక్య మోడల్‌ స్కూల్‌ లో నిర్వహించిన గాయత్రీ యజ్ఞంలో పాల్గొని మాట్లాడారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో నిజామాబాద్‌ బీజేపి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలువనున్నానని ఆశాభావం వ్యక్తం చేసారు. రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాని పరిస్థితిలో ...

Read More »

కొమిరెడ్డి రాములును పరామర్శించిన అర్వింద్‌

జగిత్యాల, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అర్వింద్‌ ఆదివారం మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే, సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది కొమిరెడ్డి రాములును పరమర్శించారు. గత నెలలో కొమిరెడ్డి రాములు మాతమూర్తి స్వర్గస్తులైనారు. ఆదివారం కొమిరెడ్డి రాములు కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో కొమిరెడ్డి విజయ్‌, కొమిరెడ్డి అజాద్‌, కొమిరెడ్డి అభిమానులు, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Read More »

రోడ్డు భద్రతపై అవగాహన

నిజామాబాద్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ఈనెల 11వ తేదీన భీంగల్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా రవాణా అధికారి డి.వి.రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భీమ్‌గల్‌ పట్టణంలో కళాశాల, పాఠశాలల విద్యార్థులచే ర్యాలీ, వాహన చోదకులకు అవగాహన సమావేశం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Read More »

విద్యార్థులకు నోటుపుస్తకాల పంపిణీ

ఆర్మూర్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి ఆదివారం వసంత పంచమి సందర్భంగా రామందిర్‌ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కౌన్సిలర్‌ పండిత్‌ ప్రేమ్‌ ఆధ్వర్యంలో నిర్యాహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు అక్షరాబ్యాసం చేయించారు. సరస్వతి మాత విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వెంట పలువురు తెరాస నాయకులు, తదితరులు ఉన్నారు.

Read More »

ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసంతపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారంఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్‌ డివిజన్‌ కేంద్రంలోని సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌ గౌడ్‌, నియోజకవర్గ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

అంగన్వాడీ కేంద్రానికి తాళం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలంలోని ఊట్‌పల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం శనివారం తాళంతో దర్శనమిచ్చింది. వివరాల్లోకి వెళితే ఊట్‌పల్లి గ్రామంలోని అంగన్వాడీ టీచర్‌ శనివారం ఎవరి అనుమతి లేకుండా విధులకు డుమ్మా కొట్టిందని గ్రామస్తులు బోధన్‌ సీడీపీఓకు సమాచారం ఇచ్చారు. అయినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1న సెలవు ఇచ్చి, ఫిబ్రవరి 9 రెండో శనివారం నాడు వర్కింగ్‌ డే పెట్టడం జరిగింది. అంగన్వాడీ టీచర్‌ ఫిబ్రవరి ...

Read More »

ఫలించిన ఎంపి కవిత కృషి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) నుంచి పూర్తిస్థాయి అనుమతులు వచ్చాయి. ఈ మేరకు ఎంసీఐ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతులు రావడంలో నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత కషి ఎంతో ఉంది. నిజామాబాద్‌లోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలతో పాటు అనుబంధ జిల్లాకేంద్ర ప్రభుత్వ దవాఖానలో కోట్లాది రూపాయలతో మౌలిక వసతులు కల్పించడంతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తెచ్చారు. దీంతో పాటు ...

Read More »

కామారెడ్డి డిసిసి అధ్యక్షునిగా కైలాస్‌ శ్రీనివాస్‌రావు

కామారెడ్డి, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులను ప్రకటించడం జరిగింది. కామారెడ్డి జిల్లాకు మొట్టమొదటి కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షునిగా కామారెడ్డి పట్టణానికి చెందిన కైలాస్‌ శ్రీనివాస్‌ రావును అధిష్టానం ప్రకటించింది. మాజీ శాసనమండలి ప్రతిపక్షనేత ఎమ్మెల్సీ మహమ్మద్‌ అలీ షబ్బీర్‌కు సన్నిహితుడైన కైలాస్‌ శ్రీనివాసరావు పదవి వరించింది. గతంలో కామారెడ్డి పట్టణ మున్సిపల్‌ చైర్మన్‌గా, కామారెడ్డి పట్టణ అధ్యక్షునిగా, ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తగా ఉన్న శ్రీనివాసరావు అంచెలంచెలుగా ఎదిగి కాంగ్రెస్‌ ...

Read More »